ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అన్నక్యాంటీన్లలో ఆప్కో షోరూంలు! - ఆప్కో షోరూం వార్తలు

అన్న క్యాంటీన్లను ఆప్కో సంస్థ వాడుకోనుంది. క్యాంటీన్లలో ఉన్న గదులను షోరూంగా మలిచి..తమ ఉత్పత్తులను విక్రయించేందకు సన్నాహాలు చేసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 109 ఆప్కో షోరూంలతోపాటు అదనంగా మరో 50 ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

apco handloom showrooms will establish in Anna canteen
అన్నక్యాంటీన్లలో ఆప్కో షోరూంలు

By

Published : Feb 20, 2021, 8:06 AM IST

అన్నక్యాంటీన్లలో షోరూంల ఏర్పాటుకు ఆప్కో అధికారులు మొగ్గు చూపుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండి మార్కెటింగ్‌కు అవకాశమున్న ప్రాంతాల్లోని క్యాంటీన్లలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వినియోగంలో లేని అన్నక్యాంటీన్లను కేటాయించాలని పురపాలక శాఖకు ఆప్కో అధికారులు విన్నవించారు. వీటితోపాటు పురపాలక సంఘాలకు చెందిన కాంప్లెక్స్‌లలో షోరూంల ఏర్పాటుకు ప్రత్యేక గదులు కేటాయించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 109 ఆప్కో షోరూంలతోపాటు అదనంగా మరో 50 ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం చేనేత వస్త్రాల్లో చీరలు, డ్రెస్‌మెటీరియల్స్‌ అత్యధికంగా నేస్తున్నారు. ఇప్పటికే ఉన్న సంప్రదాయ డిజైన్లు కాకుండా కొత్త వెరైటీలను అందుబాటులోకి తెస్తున్నారు. వీటితోపాటు యువత ఆసక్తికి తగ్గట్టు కొత్తగా డ్రెస్‌లు, చుడీదార్లు, చొక్కాలు అందుబాటులో ఉంచనున్నారు. వీటి తయారీ ఇప్పటికే మొదలైంది. నాణ్యంగా ఉండటంతోపాటు ప్రైవేటు మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 15నాటికి అన్ని షోరూంలలోనూ వీటిని అందుబాటులోకి తేనున్నారు.

ABOUT THE AUTHOR

...view details