ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రఘురామను విచారించడానికి వచ్చిన ఏపీ సీఐడీ బృందం.. రాలేనని సమాధానమిచ్చిన ఎంపీ - ఏపీ సీఐడీ అధికారుల బృందం

APCID
APCID

By

Published : Sep 19, 2022, 12:48 PM IST

Updated : Sep 19, 2022, 2:19 PM IST

12:44 September 19

రఘురామను మూడు రోజులు విచారించేందుకు వచ్చిన ఏపీ సీఐడీ బృందం

APCID : నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును మూడు రోజులపాటు విచారించేందుకు ఏపీ సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుంది. దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో ఆయనను విచారించనున్నారు. అయితే ఎంపీకి గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్య ఉండడంతో సిబ్బంది బృందం వైద్య నిపుణుడి వెంటతీసుకొచ్చారు.

ముగ్గురు మధ్యవర్తుల సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్, మరొకరి ముందు విచారించాలని నిర్ణయించారు. సీఐడీ డీఐజీ సునీల్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్పీలు జయసూర్య, గోపాలకృష్ణ, ఇద్దరు సీఐలు.. మరో ఇద్దరు ఎస్సైల సమక్షంలో విచారించనున్నారు. అయితే ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఈ రోజు విచారణకు రాలేకపోతున్నానని సీఐడీ అధికారులకు సమాచారం అందించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 19, 2022, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details