మూడు రాజధానులంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని పీసీసీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. ఒక రాజధానికే దిక్కు దివాణం లేదని... మూడు రాజధానులు నిర్మిస్తున్న జగన్ తీరు.. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెగురుతా అన్నట్లుందని ఎద్దేవా చేశారు. సీమ ప్రజలకు అమరావతి 450 కిలోమీటర్ల దూరం కాగా... విశాఖ అయితే 900 కిలోమీటర్ల దూరంలో ఉందని... ఇది తీవ్ర అసౌకర్యమని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వాలు ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పింఛన్లు సకాలంలో ఇచ్చేవని... జగన్ ప్రభుత్వం జులై మాసంలో 8వ తేదీన ఇచ్చిందని... ఆగస్టులో ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదని దుయ్యబట్టారు.