ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అగ్రవర్ణ పేదలకు ఉద్యోగ రిజర్వేషన్లు ఎప్పుడు?' - తులసిరెడ్డి

కేంద్రం అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వలన అగ్రవర్ణ పేదలు నష్టపోతున్నారని ఆయన విమర్శించారు.

అగ్రవర్ణ పేదలకు ఉద్యోగ రిజర్వేషన్లు కేటాయించేదెప్పుడు? : తులసిరెడ్డి

By

Published : Aug 19, 2019, 5:38 PM IST

అగ్రవర్ణ పేదలకు ఉద్యోగ రిజర్వేషన్లు కేటాయించేదెప్పుడు? : తులసిరెడ్డి
అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లు వైకాపా ప్రభుత్వం విద్యా సంస్థలలో మాత్రమే అమలు చేస్తుంది తప్ప.. ఉద్యోగ నియామకాల్లో అమలు చేయకపోవడం శోచనీయమని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 1 లక్షా 31 వేల గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టుల్లో 27 వేల ఉద్యోగాలు ప్రభుత్వ నిర్వాకం వలన అగ్రవర్ణ పేదలకు రాలేదన్నారు. త్వరలో భర్తీకానున్న సచివాలయ పోస్టులలో 13 వేల ఉద్యోగాలు అగ్రవర్ణ పేదలకు రావాల్సి ఉంది..వాటి పరిస్థితేంటని ప్రశ్నించారు. అగ్రవర్ణాల పేదలకు న్యాయబద్ధంగా రావాల్సిన ఉద్యోగాలు కేటాయించకుండా ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్నారు. అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details