ప్రభుత్వం మొండి వైఖరి వీడి.. స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కోరారు. స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే ఎన్నికలు తప్పనిసరిగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.
రెండు రాజ్యంగబద్ధ సంస్థల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా చర్చలతో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.