బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగేందుకు వైకాపా ప్రభుత్వ వైఫల్యమే కారణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సీఎం జగన్, వైకాపా నాయకులు తమ ప్రతాపం చూపాల్సింది ఎన్నికల కమిషనర్ మీద కాదు... రాష్ట్రానికి బడ్జెట్‌లో అన్యాయం చేసిన కేంద్రప్రభుత్వం మీద అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, పోర్టుల ఊసేలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించలేకపోతే వైకాపా ఎంపీలు రాజీనామా చేసి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు.
'విభజన హామీలు సాధించలేకపోతే రాజీనామా చేయండి' - Tulasireddy news
వైకాపా నేతలు ప్రతాపం చూపించాల్సింది ఎస్ఈసీపై కాదని...రాష్ట్రానికి బడ్జెట్‌లో అన్యాయం చేసిన కేంద్రంపైన అని ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు.
ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు తులసిరెడ్డి