ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని.. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి ఉమెన్‌చాందీ శ్రేణులకు సూచించారు. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏయే అంశాలపై పార్టీ పోరాటం చేయాలి.. పార్టీ బలోపేతం కావాలంటే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి తదితర అంశాలను కమిటీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులను అడిగి తెలుసుకున్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి: ఉమెన్‌చాందీ - AP Congress latest news
ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ ఉమెన్‌చాందీ నేతలకు, శ్రేణులకు సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈమేరకు దిశానిర్దేశం చేశారు. వైకాపా, జనసేన, తెదేపా, భాజపాలను దీటుగా ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో రైతు సమస్యలు, రాజకీయ దాడులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై దాడులు, కొవిడ్ తీవ్రత, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రత్యేక హోదా, అమరావతి హామీలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఉదయం పీసీసీ కమిటీ సభ్యులతో కూడిన సమన్వయ బృందం సమావేశం జరగ్గా... మధ్యాహ్నం డీసీసీ అధ్యక్షులతో కూడిన పార్టీ విస్తృతస్థాయి భేటీ జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పార్టీని రాష్ట్రంలో ఏ విధంగా బలోపేతం చేయాలి... వైకాపా, జనసేన, తెదేపా, భాజపాలను దీటుగా ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండీ... ప్రభుత్వం, అధికారులు.. దేవాలయాల జోలికి రావొద్దు: పరిపూర్ణానంద