కరోనా రోగులపై తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కరుణ, మానవత్వం చూపడం లేదని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శించారు. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల వద్ద అంబులెన్సులు అటు ఇటు స్వేచ్ఛగా అనుమతించాలని ఆయన కోరారు. తెలంగాణ, ఆంధ్రా సీఎంలు కలసి ప్రజల ప్రాణాలు కాపాడడానికి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పుల్లూరు దగ్గర కరోనా రోగి మరణించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటన ఎక్కడా పునరావృతం కారాదని ఆకాంక్షించారు.
'సరిహద్దుల్లో అంబులెన్సుల రాకపోకలకు అనుమతించండి' - పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్
ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్సులు స్వేచ్ఛగా తిరిగేలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు.
Sailajanath