రైతు సంఘాలు ఈ నెల 26న పిలువునిచ్చిన అఖిల భారత బ్లాక్ డేకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని పీసీసీ అధ్యక్షుడు డా.శైలజానాథ్ అన్నారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రైతుల పార్టీ అని చెప్పారు. మూడు నల్ల చట్టాలతో కేంద్ర ప్రభుత్వం రైతులను కార్పొరేట్ కూలీలుగా మార్చుతోందన్నారు. వైద్యరంగం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లడం వల్ల ప్రజల ఆస్తులతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతున్నారన్నారు.
బ్లాక్ డేకు కాంగ్రెస్ పూర్తి మద్దతు: శైలజానాథ్ - శైలజానాథ్ తాాజా వార్తలు
రైతు సంఘాలు ఈ నెల 26న పిలుపునిచ్చిన దేశ వ్యాప్త బ్లాక్ డేకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలతో రైతులు కార్పొరేట్ కూలీలుగా మారతారని విమర్శించారు.
apcc chief
వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ల చేతుల్లోకి తీసుకునేలా ఉన్న ఈ నల్ల చట్టాల వల్ల రైతులు కూలీలుగా మారడమే కాకుండా .. వ్యవసాయరంగం నాశనం అవుతుందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు నూతన చట్టాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయాలని శైలజానాథ్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:విశాఖ: హెచ్‌పీసీఎల్ సీడీయూ 3వ యూనిట్‌లో అగ్నిప్రమాదం