గుజరాత్లోని ఓఖా, సూరత్ల నుంచి విదర్భ - గోపాల్పూర్ల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు గుజరాత్ నుంచి కోస్తాంధ్ర వరకూ సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
WEATHER UPDATE: ఇవాళ, రేపు విస్తారంగా వర్షాలు..! - andhra pradesh weather updates
ఇవాళ, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
![WEATHER UPDATE: ఇవాళ, రేపు విస్తారంగా వర్షాలు..! ap weather updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12947846-913-12947846-1630573418232.jpg)
ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్లు తెలియజేసింది. దక్షిణ కోస్తాంధ్రలోని పశ్చిమగోదావరి, కృష్ణా, రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురంలోనూ ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. తూర్పుగోదావరి, నెల్లూరు, కడప జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర - యానాం తదితర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: