KRMB: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలు అనధికారికంగా జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగిస్తున్నాయని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌కు ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. అనధికారిక నీటి వినియోగాన్ని వెంటనే నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం అనధికారికంగా వాడుకున్న నీటిని 2022-23 నీటి సంవత్సరంలో ఆ రాష్ట్ర కేటాయింపుల్లో తగ్గించాలని కోరారు. ఈ మేరకు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన లేఖ రాశారు.
శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తి.. కేఆర్‌ఎంబీకి ఏపీ జలవనరుల శాఖ ఫిర్యాదు - శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తి
KRMB: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలు అనధికారికంగా జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగిస్తున్నాయని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌కు ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. అనధికారిక నీటి వినియోగాన్ని వెంటనే నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
![శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తి.. కేఆర్‌ఎంబీకి ఏపీ జలవనరుల శాఖ ఫిర్యాదు AP water resources department compalaint to KRMB over Telangana generating electricity in Srisailam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15837154-270-15837154-1657941293285.jpg)
అటు ఆలమట్టి, ఇటు తుంగభద్ర నుంచి శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. శుక్రవారం రాత్రి శ్రీశైలానికి 2.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, నీటిమట్టం 840 అడుగులకు చేరింది. దాదాపు రోజుకు 20 టీఎంసీల మేర వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 834 అడుగులు దాటగానే తెలంగాణ విద్యుదుత్పత్తి ప్రారంభించింది. తద్వారా 31 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. కృష్ణాలో ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్‌లు పూర్తిస్థాయి నీటిమట్టాలతో ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇవీ చూడండి:NIRF Rankings: ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో తెలుగురాష్ట్రాల వెనుకంజ