ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు - water grid in 6 districis in ap

ఇంటింటికీ మంచినీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం తలపెట్టిన వాటర్​ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు నిధులు మంజూరయ్యాయి. 6 జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.12,308 కోట్ల నిధులు విడుదల చేసింది.

Ap water grid funds released
వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు నిధులు విడుదల

By

Published : Jan 16, 2020, 9:27 PM IST

ఇంటింటికీ మంచినీటి స‌ర‌ఫరా ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 6 జిల్లాల్లో వాటర్‌గ్రిడ్ కోసం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర తాగునీటి సరఫరా సంస్థకు రూ.12,308 కోట్లు కేటాయించింది.

  • తూర్పు గోదావరి జిల్లా ...... రూ.3,‌960 కోట్లు
  • పశ్చిమ గోదావరి జిల్లా ..... రూ.3,670 కోట్లు
  • శ్రీ‌కాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం .... రూ.700 కోట్లు
  • గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతం ... రూ.2,665 కోట్లు
  • ప్రకాశం జిల్లా క‌నిగిరి ప్రాంతం ..... రూ.833 కోట్లు
  • పులివెందుల ప్రాంతం ....... రూ.480 కోట్లు

వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి పాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణ, పట్టణప్రాంతాల వారీగా నీటిసరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గ్రామాల్లో 100, పట్టణాల్లో 135 లీటర్ల చొప్పున కుటుంబానికి మంచి నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ప్రాజెక్టు చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details