ఆంధ్రప్రదేశ్ అంబులెన్సులను అడ్డుకునే హక్కు తెలంగాణకు లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 2024 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని గుర్తు చేశారు.
కాబట్టి అంబులెన్సులను అడ్డుకోవద్దన్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై చర్చించి భేషజాలకు పోకుండా.. ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.