ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కేంద్రం నుంచి డోసులు రాని కారణంగానే వ్యాక్సిన్ కొరత' - sajjala rama krishna comments on vaccination in ap

రాష్ట్రంలో 45 ఏళ్లు పూర్తైన వారికి ముందుగా వ్యాక్సిన్ వేసి ఆ తర్వాత మిగిలిన వారికి ఇస్తామని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరుతున్నారన్న ఆయన.. కేంద్రం నుంచి తగిన డోసులు రాని కారణంగా అందరికీ వేయలేకపోతున్నట్లు తెలిపారు. తొలి డోసు ఇచ్చిన వారికి రెండో డోసు తప్పక ఇవ్వాల్సిన అవసరం ఉందని.. రెండో డోసు వేసుకునే వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ కు, ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు.

sajjala
sajjala

By

Published : May 10, 2021, 5:36 PM IST

కొవిడ్​తో ముప్పు ఎక్కువగా ఉన్నందున ముందుగా.. వయసులో పెద్ద వారికి వ్యాక్సిన్ ఇప్పించేలా ప్రభుత్వం దృష్టి పెట్టిందని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వ్యాక్సినేషన్ పై తెదేపా సహా.. కొందరు తప్పుడు ప్రచారం చేయడం తదగన్నారు. వ్యాక్సిన్లు కొనడం లేదంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాక్సిన్ తయారీనిబట్టి, రాష్ట్రాల జనాభాను బట్టి వాక్సిన్ కేటాయిస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో స్పష్టత ఇచ్చిందన్నారు. ఆక్సిజన్, మందులు, వాక్సిన్ లు రాష్ట్రాలు సొంతంగా తయారీకి అవకాశం లేదని.. కేంద్రం పరిధిలో ఉన్నాయన్న సంగతి ప్రజలు గుర్తించాలని చెప్పారు.

కొవిడ్ నివారణ చర్యలపై అధికార యంత్రాంగం 24 గంటలూ కృషి చేస్తోందని సజ్జల స్పష్టం చేశారు. ఆక్సిజన్, రెమిడెసివిర్, కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద కొవిడ్ చికిత్స అందిస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతూ, భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. అపోహల వల్లే రాష్ట్ర సరిహద్దుల వద్ద ఎపీ నుంచి వచ్చే అంబులెన్సులను ఇవాళ తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని, ఈ సమస్యపై ఇరు రాష్ట్రాల సీఎస్ లు మాట్లాడుకుని సమస్య పరిష్కరించారని సజ్జల తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details