ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా కేసులకంటే.. ప్రతిపక్ష నేతలపై పెడుతున్న అక్రమ కేసులే ఎక్కువ' - వైకాపాపై అచ్చెన్న ఫైర్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలకు.. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టేందుకు ఉన్న పట్టుదల.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పెడితే బాగుంటుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తెదేపా నేతలపై కొవిడ్ నిబంధనల ఉల్లంఘిన కేసు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

achenna
achenna

By

Published : May 13, 2021, 3:55 PM IST

ఫిర్యాదు చేసేందుకు వెళ్లినవారిపైనే ఎదురు కేసులు పెట్టిన పోలీసులు.. ప్రజలకు ఎలాంటి సందేశమిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. సామాన్యులు పోలీసు స్టేషన్ కు రావాలంటేనే భయపడేలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులకంటే.. ప్రతిపక్ష నేతలపై పెడుతున్న అక్రమకేసులే అధికంగా ఉన్నాయన్నారు.

పోలీసులు వైకాపా నేతలకు ఒకలా... ప్రతిపక్షాల విషయంలో మరోలా చట్ట విరుద్ధంగా వ్యహహరిస్తున్నారని ఆరోపించారు. వైకాపా చెప్పినట్లు ఆడుతున్న పోలీసులకు... రానున్న రోజుల్లో చర్యలు తప్పవని అచ్చెన్న హెచ్చరించారు. తెదేపా నేతలపై పెట్టిన అక్రమ కేసుల్ని తక్షణమే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details