ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మోదీకి జగన్ ఊడిగం: సీఎం - చంద్రబాబు పాదయాత్ర

కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని సీఎం చంద్రబాబు దిల్లీలో ఆక్షేపించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధాని మోదీకి.. ప్రతిపక్ష నేత జగన్ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.

నమ్మించి మోసం చేసిన భాజపా ప్రభుత్వం చరిత్రహీనంగా మిగిలిపోతుందని చంద్రబాబు నాయుడు అన్నారు.

By

Published : Feb 12, 2019, 12:54 PM IST

నమ్మించి మోసం చేసిన భాజపా ప్రభుత్వం చరిత్రహీనంగా మిగిలిపోతుందని చంద్రబాబు నాయుడు అన్నారు.
భాజపా ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేసేందుకు దిల్లీలోని ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ కు పాదయాత్రగా వెళ్లారు. హైదరాబాద్‌ను 60 ఏళ్లపాటు అభివృద్ధి చేశామన్నారు. అక్కడి నుంచి కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్​కు తిరిగి వెళ్లామని చెప్పారు. నమ్మించి మోసం చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు పోరాడతామని స్పష్టం చేశారు. జగన్‌, మోదీ ఇద్దరూ ఒక్కటేనని... స్వప్రయోజనాల కోసం మోదీకి జగన్‌ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. మోసం చేసిన పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రయోజనాల కోసమే ధర్మపోరాట దీక్ష చేస్తున్నామని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

ABOUT THE AUTHOR

...view details