ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజ్యసభ స్థానానికి ఆర్. కృష్ణయ్య ఎంపికను వ్యతిరేకిస్తున్నాం' - ap unemployed jac on ycp rajya sabha members

AP Unemployee JAC on YSRCP rajya sabha members: రాజ్యసభ స్థానానికి వైకాపా అభ్యర్థిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్య ఎంపికను ఏపీ నిరుద్యోగ జేఏసీ వ్యతిరేకించింది. రాష్ట్రంలో నాయకులే లేనంటూ తెలంగాణకు చెందిన వ్యక్తిని ఖరారు చేయడం సరికాదన్నారు. ఈమేరకు జేఏసీ నేతలు.. విశాఖలోని కాపు ఉద్యయ నేత ముద్రగడ పద్మనాభంకి వినతిపత్రం అందజేశారు.

ap unemployed jac on R krishnaiah
ap unemployed jac on R krishnaiah

By

Published : May 18, 2022, 12:44 AM IST

రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే పలువురు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, తెలంగాణకు చెందిన ఆర్​. కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఏపీ నిరుద్యోగ జేఏసీ తప్పుపట్టింది. వైకాపా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమంత్ కుమార్, అక్క బత్తుల గిరీష్.. విశాఖపట్నంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి వినతిపత్రం అందించారు.

2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంది.. ఏపీ నిరుద్యోగులకు హైదరాబాద్​లో ఉద్యోగ అవకాశం కలిగించమని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కృష్ణయ్య కోరారా ? అని హేమంత్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణలోనే ఉద్యోగావకాశాలు ఇప్పించలేని కృష్ణయ్య.. రాజ్యసభకు వెళ్లి ఏం సాధిస్తారని అన్నారు. భాజపాను ఎదిరించి ఏపీ హక్కుల కోసం పోరాటం చేస్తారా ? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలరా ? అని హేమంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎందరో బీసీ నాయకులు, వందలాది మంది నిరుద్యోగ పోరాటాలు చేసిన నేతలు ఉన్నప్పటికీ.. వీరందరినీ కాదని తెలంగాణకు చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటు కట్టబెట్టడం సరికాదని వినతిపత్రంలో పేర్కొన్నారు.

భవిష్యత్ రాజకీయాల్లో రాష్ట్ర నిరుద్యోగ యువత కీలక పాత్ర పోషిస్తుందని.. దీనికి కాపు ఉద్యమ నేత ముద్రగడ మద్దతు కావాలని జేఏసీ నాయకులు కోరారు. ముఖ్యమంత్రి జగన్​ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల 32 వేల ఉద్యోగాలు ప్రకటించాలని డిమాండ్​ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:YSRCP MP Candidates: వైకాపా రాజ్యసభ అభ్యర్థులు వీరే..

ABOUT THE AUTHOR

...view details