ప్రగతి భవన్లో ఇరు ముఖ్యమంత్రుల భేటీ - kcr jagan meeting
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రగతి భవన్ వేదికగా సమావేశమయ్యారు. విభజన అంశాలు, నదీజలాల తరలింపు, రాష్ట్ర రాజధాని అంశంపై ముఖ్యంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్లోని ప్రగతి భవన్ వేదికగా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లోని తన నివాసం నుంచి ప్రగతి భవన్ చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వాగతం పలికారు. మధ్యాహ్న భోజనం అనంతరం సమావేశమైన ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలు, నదీ జలాల తరలింపు, ఏపీ రాజధాని అంశం, ఇతర సమస్యలు, ప్రాంతీయ, జాతీయ రాజకీయ పరిణామాలు సహా ఇతర అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.