సౌర, థర్మల్ విద్యుత్ కలిపి బండిల్డ్‌గా కొనుగోలు చేయటం వల్ల ధర పెరుగుతుండటంతో 675 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను వెనక్కి ఇచ్చేస్తామని ఏపీ ట్రాన్స్‌కో స్పష్టంచేసింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలపై పెరుగుతున్న ఆర్థిక భారం దృష్ట్యా ఇందుకు అనుమతించాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శికి.. ట్రాన్స్‌కో ఎండీ శ్రీకాంత్ మే14న లేఖ రాశారు. జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్ పథకం కింద ఎన్టీపీసీ నుంచి రాష్ట్రానికి 1300 మెగావాట్ల సౌర విద్యుత్.... 675 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. మూడేళ్లుగా సౌర విద్యుత్ కంటే బండిల్డ్ విద్యుత్ ధర అధికంగా ఉంటోంది. 2019-20లో థర్మల్ విద్యుత్ ధర సగటున యూనిట్‌కు 5రూపాయల 3 పైసలు అవుతోంది. అదే బండిల్డ్ విద్యుత్ కొనుగోలుకు సగటున యూనిట్‌కు 4రూపాయల 85పైసలు అవుతోంది. సౌర విద్యుత్ ధర యూనిట్‌కు 4రూపాయల 63పైసలు ఉంది. అంటే సౌర విద్యుత్ ధర కంటే బండిల్డ్ ధర అధికంగా ఉందని లేఖలో తెలిపారు. నిబంధనల ప్రకారం సౌర విద్యుత్ ధర కంటే బండిల్డ్ విద్యుత్ ధర ఎక్కువగా ఉంటే అధికంగా ఉన్న థర్మల్ విద్యుత్‌ను సరెండర్ చేసే వెసులుబాటు లబ్ధిదారుకు ఉంటుందన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని పరిగణలోకి తీసుకుని జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం ఫేజ్-2 కింద ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 675 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరారు.
కుడిగి, వల్లూరు ఒప్పందాలు రద్దు చేసుకుంటాం...