- బతికుండగానే చంపేశారు.. నకిలీ పత్రాలతో కోటిన్నర కొట్టేశారు..
ఓ స్థిరాస్తిపై కన్నేసిన అక్రమార్కులు... యజమాని దంపతులను బతికుండగానే చంపేశారు. వారి సొంత కుమారులను కాదని... ఓ నకిలీ వారసుడిని సృష్టించారు. ఆ ధ్రువపత్రాలను మున్సిపల్ కమిషనర్ సహా రెవెన్యూ అధికారులూ ధ్రువీకరించారు. ఆస్తి ఉన్న ఊళ్లో కాకుండా... నకిలీ పత్రాలతో మరోచోట రిజిస్ట్రేషన్ చేయించేశారు. నకిలీ పత్రాలని స్పష్టంగా తెలుస్తున్నా... సబ్ రిజిస్ట్రార్ వెనుకాముందూ చూడకుండా కోటిన్నర విలువచేసే ఇంటి అమ్మకానికి రాజముద్ర వేసి రిజిస్టర్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మొక్కజొన్న 'రైతుల గోడు'.. కష్టానికి కన్నీరే ప్రతిఫలం
వడ్డీకి తెచ్చిన అప్పులతో పెట్టుబడి పెట్టారు. ఆరుగాలం శ్రమించి పంట పండించారు. దిగుబడి బాగుంది, నాలుగు రూపాయలు చేతికొస్తాయని సంబరపడే లోపే.. వారం రోజులుగా కురుస్తున్న వర్షం శాపంలా మారింది. కోసిన మెుక్కజొన్న పొత్తులు మెులకెత్తడంతో.. విజయనగరం జిల్లా రైతులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పదినెలల చిన్నారిని తండ్రికి అప్పగించడానికి నిరాకరించిన హైకోర్టు
అనారోగ్యంతో తల్లి కన్నుమూశాక.. అమ్మమ్మ, తాతయ్య సంరక్షణలో ఉంటున్న పదినెలల చిన్నారిని తండ్రికి అప్పగించడానికి హైకోర్టు నిరాకరించింది. అమ్మమ్మ, తాతయ్య వద్ద ఆ చిన్నారి ‘అక్రమ నిర్బంధం’లో ఉందని పాప తండ్రి రుజువు చేయడంలో విఫలమయ్యారని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని అక్రమ నిర్బంధంగా ప్రకటించలేమని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హైదరాబాద్‌లో నోరూరించే ఐస్‌క్రీముల పండుగ
భారత ఐస్‌క్రీమ్ తయారీదారుల సంఘం ఐఐసీఎమ్‌ఏ ఆధ్వర్యంలో ఇండియన్ ఐస్‌క్రీమ్ ఎక్స్‌పో పదో ఎడిషన్ ఐఏఎస్ అనిత ప్రవీణ్ చేతుల మీదుగా నేడు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో వివిధ ఐస్‌క్రీమ్ బ్రాండ్స్‌కు సంబంధించిన వివిధ ఫ్లేవర్ల ఐస్‌క్రీమ్‌లను ప్రదర్శనకు ఉంచుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'విద్వేష ప్రసంగాలపై మీ వాదన సబబే కావొచ్చు'.. తలాక్‌పై కేంద్రం స్పందన కోరిన సుప్రీం
దేశంలోని మైనార్టీలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరిన్ని వివరాలతో ఈ నెల 31లోపు అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. తలాక్ పేరుతో ముస్లింలలో ఉన్న ఏకపక్ష, న్యాయవిరుద్ధమైన విడాకుల గురించి కేంద్రం, ఇతర వర్గాల అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన శునకం...