- పండగ తర్వాత సొంతూళ్లకు తిరుగు పయనం..
దసరా పండుగ కోసం సొంతూళ్లకు వచ్చిన వారంతా తిరుగు పయనమయ్యారు. వారాంతం కావడం,.. రేపట్నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో కుటుంబాలతో సహా తిరుగు పయనమయ్యారు. వెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిశాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి పెద్దఎత్తున ప్రయాణికులు విజయవాడ బస్టాండ్ చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జల దిగ్బంధంలో శ్రీకాకుళం...
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా 3 రోజులుగా జోరువానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. నదుల ఉద్ధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ నీటమునిగి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "అవినీతిపై దృష్టి మళ్లించేందుకే... మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల దుష్ప్రచారం"
అవినీతిపై దృష్టి మళ్లించేందుకే మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు.. అమరావతిపైనా, రైతుల పాదయాత్రపైనా దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. విజయసాయిరెడ్డి సహా ఇతర వైకాపా నేతలు.. విశాఖలో భూములు దోచుకున్నది వాస్తవం కాదా అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ నిలదీశారు. ఆ అవినీతి ఉత్తరాంధ్ర మంత్రులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జోరువాననూ లెక్క చేయకుండా.. లక్ష్యం వైపే నడక
అమరావతి రైతుల మహాపాదయాత్ర 28వ రోజూ కదనోత్సాహంతో సాగింది. జోరువాననూ లెక్కచేయక రైతులు... లక్ష్యంవైపు నడక సాగించారు. స్థానికులు, వివిధ ప్రజాసంఘాలు, విపక్ష నాయకులు ఎక్కడికక్కడ ఎదురెళ్లి కర్షకులను స్వాగతించారు. వారిపై పూల వర్షం కురిపిస్తూ.. కలిసి అడుగులు వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వీఐపీ మందుబాబుల కోసం సర్కారీ గెస్ట్ హౌస్లు.. ఏసీలు, బెడ్లు..
రోడ్లపై మద్యం తాగి ఎటు పోలేని స్థితిలో ఉన్న బడాబాబుల సౌకర్యార్థం.. బిహార్ అబ్కారీ శాఖ ప్రత్యేక వసతులు కల్పిస్తోంది. వారి కోసం ఏకంగా ప్రత్యేక సౌకర్యాలతో కూడిన వార్డులను సిద్ధం చేసింది. రోడ్లపై తాగి తిరిగే వారిని అతిథుల మాదిరిగా సపర్యలు చేయడానికి సమస్తిపుర్ అబ్కారీశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చెరువులో స్నానానికి దిగి.. ఆరుగురు చిన్నారులు మృతి