- Amaravati: అమరావతి అంతమే 'ఎజెండా'
రాజధానిగా అమరావతి తమకు సమ్మతమేనంటూ ప్రతిపక్ష నేత హోదాలో నాడు శాసనసభ సాక్షిగా ప్రకటించిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా మాట మార్చేశారు. అమరావతి నాశనమే ఏకైక ఎజెండాగా దానిపై విష ప్రచారానికి తెరతీశారు. పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పాట పాడుతూ.. ప్రజా రాజధాని అమరావతిని పాతాళంలోకి తొక్కేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మన్యంలో కాసులు కురిపిస్తున్న మిరియాలు...
సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన మిరియాలకు ప్రపంచ దేశాల్లో గిరాకీ ఉంది. కాఫీలో అంతరపంటగా విశాఖ మన్యానికి పరిచయమైన ఈ మిరియాలు గిరిజనులకు లాభాలను ఆర్జించిపెడుతున్నాయి. ప్రధాన పంట అయిన కాఫీకంటే రెట్టింపు లాభాలను ఈ పంట ద్వారా పొందుతుండటంతో రైతులు మిరియాల సాగుపై ఆసక్తి కనపరుస్తున్నారు. కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏలు కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాల సాగును ప్రోత్సహిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సెప్టెంబరును ‘పోషణ మాసం’గా నిర్వహిస్తోన్న ప్రభుత్వం
ఆకాశంలో చందమామనో పెరట్లో లేగదూడనో చూపిస్తూ, లేదంటే ఒళ్లో కూర్చోబెట్టుకుని కథలు చెబుతూ, ‘ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద...’ అంటూ చిట్టి బొజ్జ నిండేలా గోరుముద్దలు తినిపించడం ఒకప్పటి మాట. టీవీ చూస్తూనో ఫోను చూపిస్తూనో అన్నం పెట్టామనిపించడం ఇప్పటి మాట. మన జీవనశైలిలోనే కాదు, తినే తిండిలోనూ మార్పులొచ్చేశాయి. అవసరాన్ని మించి ఇష్టాయిష్టాలదే పైచేయి అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రైలు నుంచి పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
నెల్లూరు జిల్లాలోని వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపంలో భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ నుంచి పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భువనేశ్వర్ నుంచి తిరుపతి బయల్దేరిన భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లో వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే పొగలు లేచాయి. ఎస్-3 భోగి నుంచి పొగ రావటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సిటీ బస్సులో భారీగా మంటలు.. లోపల 12 మంది ప్రయాణికులు.. చివరకు..
ప్రయాణంలో ఉన్న బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ ఘటన జరిగింది. కర్మాడ్ నుంచి ఔరంగాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్‌కు వెళ్తున్న ఈ స్మార్ట్ సిటీ బస్సులో.. వరూద్ ఫతా ప్రాంతంలో ఉండగా మంటలు అంటుకున్నాయి. ఘటన సమయంలో బస్సులో 10 నుంచి 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వాగు దాటుతూ ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు..