- సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురి దుర్మరణం
సికింద్రాబాద్‌లో రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని రూబీ లాడ్జ్‌లో ఘటన జరిగింది. సెల్లార్‌లో ఎలక్ట్రికల్ ద్విచక్రవాహనాల బ్యాటరీలు పేలి మంటలు పైన ఉన్న లాడ్జీలోకి వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు.
- రాజధాని రైతుల తొలిరోజు మహాపాదయాత్ర సాగిందిలా
ఏకైక రాజధాని సంకల్పంతో.. అమరావతి నుంచి అరసవల్లికి రైతులు చేపట్టిన మలివిడత పాదయాత్ర తొలిరోజు మహోద్యమంలా సాగింది. ఊరూవాడా, పిల్లా పెద్దా అంతా ఒక్కటై.. రైతులకు తోడుగా ముందుకు కదిలారు. వెంకటపాలెంలో ప్రారంభమైన తొలిరోజు పాదయాత్ర.. కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు మీదుగా సాగి మంగళగిరిలో ముగిసింది.
- అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై గ్రామసభలు.. అంతా వ్యతిరేకతే..!
అమరావతిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు తొలి రోజే చుక్కెదురైంది. మొదటి రోజు గ్రామసభలు నిర్వహించిన మూడు రాజధాని గ్రామాల ప్రజలు అమరావతిని మున్సిపాలిటీగా వ్యతిరేకించారు. ప్రజాభిపాయ సేకరణ తొలిరోజు ప్రశాంతంగా జరిగింది.
- పాఠశాలల నిర్వహణలో.. ఇకపై సచివాలయ ఉద్యోగుల భాగస్వామ్యం
స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలని రాష్టప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు సందర్శించనుడగా... నెలకోసారి ఏఎన్‌ఎం సందర్శించనున్నారు. మండలస్థాయిలో ఉండే ఎంఈఓలో ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణ అంశాలు అప్పగించాలని సీఎం ఆదేశించారు.
- గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి.. అక్కడ మాత్రం..
గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌లో వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న పెట్రోలింగ్ పాయింట్ (పీపీ)-15 నుంచి భారత్, చైనా బలగాలు సోమవారం వెనక్కి మళ్లాయి. దెమ్‌చోక్, దెప్సాంగ్ ప్రాంతాల్లో వివాదాలను పరిష్కరించుకునే అంశంలో ఎలాంటి పురోగతి లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
- సోనాలి ఫోగాట్ హత్య కేసును సీబీఐకి అప్పగించిన కేంద్రం