ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు@9am - ఆంధ్రప్రదేశ్​ లేటెస్ట్​ న్యూస్​

.

9am topnews
ప్రధానవార్తలు@9am

By

Published : Sep 8, 2022, 8:59 AM IST

  • యాప్‌లో రుణమే శాపంగా మారింది. ఆ ఇద్దరు పిల్లల్ని అనాథలుగా చేసింది

‘నా పుట్టిన రోజు కదా... మమ్మీ డాడీ కేకు తీసుకొచ్చేందుకు వెళ్లారా? కాదు చెల్లీ... అమ్మానాన్న దేవుడి దగ్గరకు వెళ్లారు. తరువాత వస్తారు’ ఇది.. ఇద్దరు చిన్నారి అక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన సంభాషణ. గుండెలు పిండేసే వారి మాటలకు సమాధానం చెప్పేవారే లేరు. పాపం... వీరి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరూ అనాథలయ్యారు. ఆర్థిక అవసరాలకు ఆన్‌లైన్‌ రుణయాప్‌ల నుంచి అప్పులు తీసుకోవడమే ఆ దంపతుల పాలిట శాపమైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంలో ఎక్కడి పేదలకైనా రాజధానిలో ఇళ్ల స్థలాలు

రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాజధాని బయటి ప్రాంతాలకు చెందినవారికి ఇళ్లస్థలాలు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గతంలో హైకోర్టు నిలిపివేయడంతో... ప్రభుత్వం తన పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా సీఆర్‌డీఏ చట్టాన్నే సవరించాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం: మంత్రి అంబటి రాంబాబు

పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. డయాఫ్రం వాల్‌ దెబ్బతినడంవల్ల పనుల్లో పురోగతి లేదని, అందుకే గడువు తేదీని ప్రకటించలేమని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • AP Cabinet Decisions: ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..

వైఎస్సార్ చేయూత పథకానికి నిధుల విడుదల సహా పలు నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా 6 జిల్లాల్లో తాగునీరు అందించేందుకు.. 4020 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. గ్రామ సచివాలయ సిబ్బంది ప్రొబేషన్ డిక్లరేషన్ ర్యాటిఫికేషన్‌కు ఆమోదం సహా పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా?'

దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా అని సుప్రీం కోర్టు కర్ణాటక పాఠశాలల్లో హిజాబ్‌ ఆంక్షలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా బుధవారం వ్యాఖ్యానించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ) ప్రకారం గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉందని వాదించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కర్తవ్యపథ్'​గా మారనున్న 'రాజ్​పథ్'​.. మోదీ చేతులమీదుగా నేడు ప్రారంభం

దేశ రాజధానిలో ఎంతో విశిష్టత కలిగిన రాజ్‌పథ్‌ పేరు.. కర్తవ్యపథ్‌గా మారనుంది. ఈ మేరకు కేంద్రం పంపిన ప్రతిపాదనకు దిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. విజయ్‌చౌక్‌ నుంచి ఇండియాగేట్‌ వరకు రాజ్‌పథ్‌ ప్రాంతంలో అభివృద్ధి చేసిన సెంట్రల్ అవెన్యూను ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రారంభం నేపథ్యంలో అధికారులు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమెరికాలో భారతి సంతతి వ్యక్తుల హవా..

భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు అమెరికాలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలపై ప్రతిరోజూ పాత్రికేయులకు వివరించే విశేష బాధ్యతను వేదాంత్‌ పటేల్‌కు వైట్​హోస్ అప్పగించింది. మరోవైపు భారతి సంతతి న్యాయవాది అరుణ్ సుబ్రమణియన్​.. న్యూయార్క్ జిల్లా కోర్టు జడ్జి పదవికి నామినేట్ అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇకపై బీమా పాలసీలన్నీ డిజిటల్​మయం.. కొత్తవాటికీ నో బాండ్స్​!

మీ వద్ద బీమా పాలసీ బాండ్లు, పాలసీ పేపర్లు ఉన్నాయా...? అయితే వాటన్నింటినీ త్వరలో డిజిటల్‌ పద్ధతికి మార్చుకోవాల్సిందే అని భారతీయ బీమా నియంత్రణ ఓ ప్రకటనలో తెలిపింది . అంతేకాదు.. కొత్తగా తీసుకునే పాలసీలకు బీమా కంపెనీలు ఎటువంటి బాండు కానీ పత్రాలు కానీ జారీ చేయవని కూడా చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బల్లెం వీరుడు నీరజ్ చోప్రా​ మరోసారి చరిత్ర సృష్టిస్తాడా?

భారత జావెలిన్‌ త్రో స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా మరో చరిత్ర ముంగిట నిలిచాడు. డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో గురువారం ఆరంభమయ్యే ఈ పోటీల్లో బరిలో దిగుతున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ ఫొటోలో ఉన్న స్టార్​ హీరోయిన్​ ఎవరో గుర్తుపట్టగలరా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అమ్మ చేతిలో ముద్దుగా ఒదిగి ఉన్న ఓ స్టార్​ హీరోయిన్​ చిన్ననాటి ఫొటో హల్​చల్​ చేస్తోంది.రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి తన అభినయం అందం, నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తారలు ఎంతోమంది ఉన్నారు. అలా ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్​లో ఈమె కూడా ఒకరు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details