ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOPNEWS ప్రధాన వార్తలు 11AM - ap top ten news

.

TOPNEWS
TOPNEWS

By

Published : Aug 15, 2022, 10:59 AM IST

  • పింగళి రూపొందించిన జెండా భారతీయుల గుండె..
    జాతీయ జెండా మన స్వాతంత్య్రానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామికి ప్రతీక అని సీఎం జగన్​ తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ISRO తక్కువ వేగం వల్లే ఎస్‌ఎస్‌ఎల్‌వీ విఫలం..
    ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసి, మొట్టమొదటిసారి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) తక్కువ వేగం కారణంగానే నిర్దేశించిన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేక పోయినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఉపగ్రహం తన కక్ష్యను కోల్పోవడం వల్లే ఎస్‌ఎస్‌ఎల్‌వీలో లోపం జరిగినట్లు స్పష్టమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చిత్తూరు కలెక్టర్‌ సహా రెవెన్యూ అధికారులకు లోకాయుక్త నోటీసులు..
    చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారులకు లోకాయుక్త నోటీసులు జారీచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని తిరిగి ఇచ్చేస్తానని, ఆ 82 సెంట్ల భూమిని తిరిగి అప్పగించాలని కోరుతూ లోకాయుక్తను ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాష్ట్ర డిస్కంలను రెడ్‌ కేటగిరీలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం..
    రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు- డిస్కంలను... కేంద్ర ప్రభుత్వం రెడ్‌ కేటగిరీలో చేర్చింది. వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్‌కు చెల్లించాల్సిన 11వేల 149 కోట్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచడమే ఈ చర్యకు కారణమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జాతి వజ్రాలు జాగృత తేజాలు, స్వాతంత్య్రం కోసం పోరాడిన ధీరులు..
    దేశ స్వతంత్ర పోరాటంలో భాగంగా తమ సర్వాన్నీ త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలు ఎందరో. జైలు జీవితాన్నీ సంతోషంగా అనుభవించిన ఉదాత్తులు ఎందరో. వారందరికీ దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ వేనవేల వందనాలు. అలాంటి వారిలో కొందరి గురించి క్లుప్తంగా స్మరించుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నోబెల్​ను ముద్దాడిన శాంతి దూతలు, శాస్త్ర స్రష్టలు..
    శాస్త్ర సాంకేతిక, సాహిత్యాది రంగాల్లో అసమాన ప్రతిభ చూపి ప్రపంచ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా పది మంది భారతీయులు నోబెల్​ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా వారిని ఓ సారి స్మరించుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అలా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానన్న అనుపమ పరమేశ్వరన్​..
    "అవకాశం వచ్చింది కదాని ఏదొకటి చేసేయాలని తొందర నాకు లేదు. ఏం చేసినా మంచి కథలే చేయాలనుకుంటున్నా. గుర్తుండిపోయే పాత్రలే పోషించాలనుకుంటున్నా" అంది నటి అనుపమ పరమేశ్వరన్‌. ఆమె.. నిఖిల్‌ జంటగా నటించిన చిత్రం 'కార్తికేయ2' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్​హిట్​ను అందుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హమారా క్రీడా మహాన్‌, ఆటల్లో దూకుడు కొనసాగిస్తే భవిష్యత్ మనదే..
    దేశ క్రీడాకారులు మన సత్తాను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా ఓ సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పటివరకు క్రీడల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. అయినా సాగించాల్సిన ప్రయాణం.. చేరాల్సిన గమ్యం ఇంకా ఎంతో దూరం ఉంది. 21వ శతాబ్దం ఆరంభం నుంచి ఆటల్లో మన దూకుడు పెరిగింది.. ఇదే జోరు కొనసాగిస్తే భవిష్యత్‌ మనదే!. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇక మినహాయింపులు లేకుండా కొత్త ఆదాయపు పన్ను విధానం..
    ఆదాయపు పన్ను చెల్లింపులకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది ప్రభుత్వం. ప్రస్తుత విధానం కాకుండా మినహాయింపులు లేని కొత్త పన్ను విధానం లోకి అత్యధికులను ఆకర్షించేందుకు ఆర్థిక శాఖ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లలో ఎక్కువ మంది కొత్త పన్ను విధానానికి మారేందుకు వీలుగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉక్రెయిన్‌లో సమాధులను తవ్వుతున్న ప్రజలు, అసలేమైంది..
    ఉక్రెయిన్​లోని లుహాన్స్క్​ ప్రాంత ప్రజలు సమాధులు తవ్వుతున్నారు. తమ కుటుంబీకుల మృతదేహాలను వెలికితీసి గౌరవప్రదంగా మరోసారి అంతిమ సంస్కారాలు జరుపుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details