ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1PM - ap top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

AP TOPNEWS
AP TOPNEWS

By

Published : Jul 23, 2022, 12:59 PM IST

  • GODAVARI FLOODS: తిండిలేక.. ఉండలేక.. వరద ప్రాంతాల్లో దుర్బర పరిస్థితులు..
    గోదావరి వరదలు సామాన్యుల జీవన విధానాన్ని అతలాకుతలం చేశాయి. తినడానికి తిండి, తాగడానికి నీరు, ఉండటానికి నివాసం లేక అవస్థలు పడుతున్నారు. వరదల కారణంగా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పయనమయ్యారు. రాష్ట్రంలోని కోనసీమ, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు వరదలకు అల్లాడిపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • PETROL BUNKS: అక్కడ కళకళ.. ఇక్కడ మాత్రం..
    రాష్ట్రంలో ఇంధన ధరల బాదుడు భరించలేక.. సరిహద్దులోని ప్రజలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పెట్రోల్ బంక్​లు వెలవెలబోతుండగా.. సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బంక్​లు కళకళలాడుతున్నాయి. అంతేకాదు అక్కడ బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హైకోర్టులో 2,35,617 కేసులు పెండింగ్‌.. ఆ 2 లక్షల కేసుల్లో..
    హైకోర్టులో నమోదైన పెండింగ్ కేసుల్లో.. ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న కేసులే అత్యధిక భాగం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2022 జూలై 15 నాటికి.. హైకోర్టులో 2 లక్షల 35,617 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు.. కేంద్ర న్యాయశాఖ రాజ్య సభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం.. ఇల్లు, పొలం ఆక్రమించిన వైనం..
    తమ పొలం, ఇల్లును వైకాపా నాయకులు ఆక్రమించాడని.. ప్రకాశం జిల్లా మండాదివారిపల్లెకి చెందిన కొండయ్య దంపతులు.. జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఆస్తిని మొత్తం తన పేరుపై రాయాలని ఒత్తిడి చేస్తూ భయపెడుతున్నారని వాపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హాజరు చెప్పలేదని వాతలొచ్చేలా కొట్టిన టీచర్​.. బాలికలతో మరుగుదొడ్లు కడిగించి..
    పాఠశాలకు రాలేదని విద్యార్థినిలతో మరుగుదొడ్లు కడిగించింది ఓ ఉపాధ్యాయురాలు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. రాజస్థాన్​లో జరిగిన మరో ఘటనలో హాజరు చెప్పలేదని 7వ తరగతి విద్యార్థిని వీపు మీద వాతలొచ్చేలా చితకబాదాడు ఓ టీచర్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రైల్వే స్టేషన్​లో సామూహిక అత్యాచారం.. అక్కడి ఉద్యోగుల పనే..
    దిల్లీలో దారుణం జరిగింది. 30 ఏళ్ల మహిళపై రైల్వే స్టేషన్​లోనే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు రైల్వే శాఖ ఉద్యోగులు. జులై 21న ఈ ఘటన జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రూ.199 చెప్పులతో 'లైగ‌ర్' ట్రైల‌ర్ లాంచ్​కు హాజరైన విజయ్​.. రణ్​వీర్​ పొగడ్తలు..
    'లైగర్‌' హిందీ ట్రైలర్​ ఆవిష్కరణలో విజయ్​ దేవరకొండ- రణ్‌వీర్‌ సింగ్‌ మధ్య ఆసక్తికర విషయం జరిగింది. రూ.199 చెప్పులతో 'లైగ‌ర్' ట్రైల‌ర్ లాంచ్​కు విజయ్​ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రణ్‌వీర్‌ సింగ్‌.. విజయ్​ను పొగడ్తలతో ముంచెత్తాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అదరగొట్టిన ధావన్​, గిల్​.. ఉత్కంఠ పోరులో భారత్​ విజయం..
    వెస్టిండీస్‌తో మూడు వన్డేల్లో భాగంగా మొదటి మ్యాచ్‌లో.. టీమ్ఇండియా మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(97), శుభ్‌మన్‌ గిల్‌(64), శ్రేయస్‌ అయ్యర్‌(54) అర్ధశతకాలతో మెరిశారు.309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి విండీస్‌ ఆఖరి బంతి వరకూ పోరాడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వరదల్లో పాడైన వాహనాలకు బీమా వర్తిస్తుందా?..
    కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక వాహనాలు వరద నీటిలో చిక్కుకొని పాడయ్యాయి. ఫలితంగా ఇప్పుడవి పనిచేయక సర్వీసింగ్​ సెంటర్లకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ.. అక్కడికి వెళ్తే ఎంత ఖర్చవుతుందోననే భయం చాలా మందిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు బీమా వైపు చూస్తుంటారు. అయితే.. పాడైన వాహనాలకు బీమా వర్తిస్తుందా? ఏయే పాలసీలు ఎలాంటి కవరేజీ అందిస్తాయనే విషయాలు మీకోసం... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరో.. లిజ్​ ట్రస్​కు పెరిగిన మద్దతు.. మరి రిషి సునాక్​?..
    బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ (42), విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ (46) బరిలో మిగిలారు. ఇద్దరిలో ఎవరు ప్రధాని అవుతారన్నది కన్జర్వేటివ్‌ పార్లమెంటరీ పార్టీతోపాటు ఆ పార్టీ సభ్యుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే పార్టీ సభ్యుల్లో అత్యధికులు ట్రస్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. 'యూగవ్' అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details