ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు@9AM - ఏపీ టాప్ న్యూస్

.

AP Topnews
AP Topnews

By

Published : Jul 23, 2022, 9:03 AM IST

  • AP Highcourt shifting: ఏపి హైకోర్టు తరలింపు ప్రతిపాదన.. కేంద్రం వద్ద పెండింగులో లేదు-కేంద్ర మంత్రి..
    ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రతిపాదనలేవీ కేంద్రం వద్ద పెండింగులో లేవని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఒక హైకోర్టును ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి బదిలీ చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • UKHCDO chairperson: యూకేహెచ్‌సీడీఓ ఛైర్‌పర్సన్‌గా.. తొలి తెలుగు మహిళా డా.ప్రతిమా చౌదరి..
    ‘ద యునైటెడ్‌ కింగ్‌డమ్‌ హీమోఫీలియా సెంటర్‌ డాక్టర్స్‌ ఆర్గనైజేషన్‌ (యూకేహెచ్‌సీడీఓ)’ ఛైర్‌పర్సన్‌గా ప్రొఫెసర్‌ డా.ప్రతిమాచౌదరి మావిళ్లపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • SRISAILAM: శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. నేడు గేట్లు ఎత్తివేత..
    ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. నీటిమట్టం 881.90 అడుగులు, నీటినిల్వ 198.3623 టీఎంసీలుగా నమోదైంది. ఈ ఉదయం 11 గంటలకు ఆనకట్ట గేట్లు పైకెత్తి.. దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • Capital Farmers: నెలనెలా పరిహారం ఇప్పించండి-రాజధాని రైతులు..
    రాజధాని భూముల పరిహారంపై రైతులు వేసిన వ్యాజ్యాలపై హై కోర్టు విచారణ జరిపింది. రాజధాని అమరావతి కోసం తమ భూములను ప్రభుత్వానికి , సీఆర్డీఏకు రైతులు అప్పగించారని, నిబంధనల ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లు తిరిగి ఇవ్వకపోవడంతో వారి బతుకు భారంగా మారిందని పిటిషనర్ల తరపు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • రాష్ట్రపతి కోవింద్​కు మోదీ విందు.. వారికి పీఎంఓ షాక్​.. నో ఇన్విటేషన్​!..
    రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 24వ తేదీతో పదవీ విరమణ చేయబోతున్నందున.. ఆయన గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ.. శుక్రవారం రాత్రి దిల్లీలో విందు ఇచ్చారు. కోవింద్‌ దంపతులు, కాబోయే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులతో పాటు భాజపా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. ఆత్మహత్యా? లేక..
    ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విగతజీవులుగా కనిపించడం కలకలం సృష్టించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, రాజస్థాన్​లో ఓ నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన మైనర్​ బాలుడుతోపాటు యువకుడ్ని పోలీసులు అరెస్ట్​ చేశారు.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • అనుష్క కొత్త ప్రయాణం.. మెల్​బోర్న్​లో తాప్సీ 'దోబారా'..
    హీరోయిన్​ తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన 'దోబారా' చిత్రం.. వచ్చే నెలలో జరగనున్న మెల్​బోర్న్​ ఇండియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ప్రదర్శితమవ్వనుంది. మరోవైపు, 'నిశ్శబ్దం' మూవీ తర్వాత కొన్నాళ్లపాటు విరామం తీసుకున్న అనుష్క.. ఇటీవలే కొత్త సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చింది.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • అదరగొట్టిన ధావన్​, గిల్​.. ఉత్కంఠ పోరులో భారత్​ విజయం..
    వెస్టిండీస్‌తో మూడు వన్డేల్లో భాగంగా మొదటి మ్యాచ్‌లో.. టీమ్ఇండియా మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(97), శుభ్‌మన్‌ గిల్‌(64), శ్రేయస్‌ అయ్యర్‌(54) అర్ధశతకాలతో మెరిశారు.309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి విండీస్‌ ఆఖరి బంతి వరకూ పోరాడింది.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'రూపాయి బలంగానే ఉంది.. ఇతర దేశాల కరెన్సీల కంటే మనదే బెటర్​'..
    రూపాయి పతనాన్ని నిలువరించేందుకు విదేశీ మారకపు నిల్వల్లో కొంత మేర వినియోగిస్తామని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత్​ దాస్​ తెలిపారు. రూపాయి భారీ ఊగిసలాటను చూస్తూ ఆర్​బీఐ ఊరుకోదని, అయితే రూపాయి విలువ ఇంతమేర ఉంచాలనే లక్ష్యాన్ని ఆర్​బీఐ విధించుకోలేదని స్పష్టం చేశారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరో.. లిజ్​ ట్రస్​కు పెరిగిన మద్దతు.. మరి రిషి సునాక్​?..
    బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ (42), విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ (46) బరిలో మిగిలారు. ఇద్దరిలో ఎవరు ప్రధాని అవుతారన్నది కన్జర్వేటివ్‌ పార్లమెంటరీ పార్టీతోపాటు ఆ పార్టీ సభ్యుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే పార్టీ సభ్యుల్లో అత్యధికులు ట్రస్‌ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details