ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM - ఆంధ్ర న్యూస్

.

AP Top news
AP Top news

By

Published : Jul 19, 2022, 5:02 PM IST

  • 2024 జులై నాటికి పోలవరం పూర్తి చేయడం సాధ్యమన్న కేంద్రం..
    పోలవరం ప్రాజెక్టు గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. 2024 జులై నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. పార్లమెంటులో కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే జాప్యం అవుతోందని ప్రకటించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. హామీలు చాలా వరకు నెరవేర్చాం: కేంద్రం..రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి పాత మాటే చెప్పింది. హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ మరోసారి లోక్‌సభకు తెలిపింది. విభజన చట్టం హామీలను చాలావరకు నెరవేర్చామన్న హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్..హామీల్లో కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • జగన్ రెడ్డి చేసే తప్పుల్లో ఆమెకూ భాగముంది: వంగలపూడి అనిత..సీఎం జగన్ రెడ్డి చేసే తప్పుల్లో భారతిరెడ్డికీ భాగముందని.. తెదేపా నేత వంగలపూడి అనిత ఆరోపించారు. భర్తను వెనకేసుకురావడం, తెచ్చిన సూట్ కేసులు లెక్కేసుకోవడం, చేస్తున్న తప్పులను ప్రచార ఆర్భాటాలకు ఉపయోగించడం చేస్తున్నారని ధ్వజమెత్తారు.పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయాలని అడగగలమా?: మంత్రి బొత్స..పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు ముప్పు, విలీన మండలాలను తెలంగాణలో కలపాలంటూ ఆ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్‌ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని.. గతంలా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని తాము అడిగితే బావుంటుందా? అని ప్రశ్నించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • యువకుడిపై దుండగుల హత్యాయత్నం.. 'నుపుర్​ శర్మ వీడియో చూడడమే కారణం'!..బిహార్​లోని ఓ యువకుడిపై మరో వర్గానికి చెందిన పలువురు కత్తితో దాడి చేశారు. నుపుర్​ శర్మ వివాదాస్పద వీడియో చూడటం వల్లే యువకుడిపై హత్యాయత్నం జరిగినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు.పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'లోదుస్తులన్నీ ఓకే చోట.. చున్నీ కూడా లేదు'.. నీట్​ అభ్యర్థి తీవ్ర భావోద్వేగం..కేరళలో నీట్ పరీక్ష వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. విద్యార్థులు తమకు ఎదురైన అవమానకరమైన అనుభవాలను 'ఈటీవీ భారత్'​తో పంచుకున్నారు. మరికొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. మరోవైపు, కళాశాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • రవితేజ- నిర్మాత సుధాకర్​ మధ్య గొడవకు కారణం వాళ్లేనట.. మాస్ మహారాజా​ క్లారిటీ..రవితేజ హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'రామారావు ఆన్‌ డ్యూటీ'. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జులై 29న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో నిర్మాత సుధాకర్​- రవితేజ మధ్య మనస్పర్థల వల్లే సినిమా వాయిదా పడినట్లు ప్రచారం జరిగింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • కోహ్లీ నాతో 20నిమిషాలు మాట్లాడితే.. తిరిగి ఫామ్​లోకి..: గావస్కర్‌..ఫామ్​ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే కొంతమంది ఆటగాళ్లు, సీనియర్లు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా.. దిగ్గజ ఆటగాడు గావస్కర్‌ కోహ్లీకి తన విలువైన సలహాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'అలా అయితే పెరుగు, పప్పు, బియ్యంపై నో జీఎస్​టీ'.. నిర్మల​ క్లారిటీ..సోమవారం అమలులోకి వచ్చిన కొత్త జీఎస్​టీ నిబంధనలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ మరింత స్పష్టత ఇచ్చారు. పెరుగు సహా 11 రకాల వస్తువుల జాబితాను పేర్కొంటూ.. అవి విడిగా అమ్మితే వాటిపై జీఎస్​టీ వర్తించదని తేల్చిచెప్పారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • బస్సు-లారీ ఢీ.. 22 మంది మృతి.. 33 మందికి గాయాలు..ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మంది గాయపడ్డారు. ఈజిప్ట్​ మిన్యా రాష్ట్రం మాలావిలో జరిగిందీ ఘోర ప్రమాదం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details