- వరద సహాయక చర్యలపై తెదేపా ఆగ్రహం.. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
వరదలతో జనాలు అల్లాడిపోతున్నారు. ముంపు బారిన పడ్డ ప్రజలు సర్వసం కోల్పోయారని.. వారికి కనీసం ఆహారం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని తెదేపా విమర్శించింది. వరద బాధితులకు ఇచ్చే సహాయం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- రెండు వారాల్లోగా ఆ నిధులు వెనక్కి ఇవ్వాలి.. ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల మళ్లింపుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. పీడీ ఖాతాలకు మళ్లించిన నిధులను.. రెండు వారాల్లోగా వెనక్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- సాయం అందించాల్సిన నిధులు మళ్లించడమేంటి?: చంద్రబాబు
కొవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను దారి మళ్లించడమేంటని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. దారి మళ్లించిన నిధులను వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాలో జమ చెయ్యాలని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి పాలనకు చెంపపెట్టు అని అన్నారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- నిన్ను విడిచి ఉండలేక.. భర్తతోనే భార్య
వారిద్దరిదీ అన్యోన్య దాంపత్యం.. ఒకరంటే మరొకరికి ఎనలేని ప్రేమ.. ఇది చూసి కాలానికి కన్ను కుట్టిందేమో ఇద్దరినీ కొన్ని గంటల వ్యవధిలోనే ఈ లోకం నుంచి తీసుకెళ్లింది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- వరదలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్ల!
ఒడిశాలో గతకొద్ది రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి.. రాయగడలోని ఖైరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదల ధాటికి ఓ ఏనుగు పిల్ల నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దాన్ని గమనించిన స్థానికులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు, గోదావరి నది ఉగ్రరూపం దాల్చడం వల్ల మల్కాన్‌గిరి జిల్లాలో అనేక గ్రామాలు జలమయమయ్యాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- పండగలా రాష్ట్రపతి ఎన్నిక.. ఓటేసిన ఎంపీలు.. వీల్‌ఛైర్‌లో మన్మోహన్
భారత 15వ రాష్ట్రపతి ఎన్నికకు నిర్వహించిన పోలింగ్‌లో.. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా.. పార్లమెంట్ ప్రాంగణం ఎంపీలతో కళకళలాడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు పార్లమెంట్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- చిక్కుల్లో మణిరత్నం, విక్రమ్.. నోటీసులు పంపిన కోర్టు!
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, హీరో విక్రమ్‌పై ఓ న్యాయవాది పలు ఆరోపణలు చేశారు. కోర్టును ఆశ్రయించి.. వారికి నోటిసులు పంపారు. ఇంతకీ ఏం జరిగిందంటే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- రవిశాస్త్రికి పంత్ ఊహించని 'గిఫ్ట్'.. ఈలలతో మోగిపోయిన స్టేడియం!
టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిపై బ్యాటర్ పంత్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన తర్వాత రవిశాస్త్రికి ఓ ఊహించని బహుమతిని ఇచ్చాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- మార్కెట్లకు లాభాల పంట.. సెన్సెక్స్ 760 ప్లస్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 760 పాయింట్లు, నిఫ్టీ 229 పాయింట్లు లాభపడ్డాయి.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- గుంతలో పడ్డ గున్న ఏనుగు.. సీపీఆర్ చేసి రక్షించిన సిబ్బంది
థాయ్‌లాండ్ నఖోన్ నాయొక్ రాష్ట్రంలోని ఖావో యాయ్ జాతీయ పార్క్‌లో ఓ భారీ గుంతలో ఏడాది వయసున్న గున్న ఏనుగు పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు తల్లి ఏనుగు శాయశక్తులా ప్రయత్నించింది. వర్షం, బురద కారణంగా దాని ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే దాన్ని కాపాడేందుకు జంతు సంరక్షకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది గమనించిన తల్లి ఏనుగు.. మరింత ఆందోళనకు గురైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి