- విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు భారం
విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు భారం పెరిగింది. ప్రతి కనెక్షన్ కింద 2014 నుంచి 2019 వరకు వినియోగించిన మొత్తం విద్యుత్‌ను లెక్కించిన డిస్కంలు.. దాని ఆధారంగా నెలకు వాడిన సగటు యూనిట్లను లెక్క తేల్చాయి. 2022 జులై బిల్లులో ట్రూఅప్ కింద చూపిన మొత్తం ఎలాంటి మార్పు లేకుండా 36 నెలలపాటు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో అదానీకి.. జాతీయ రహదారి ప్యాకేజీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఓటీ (నిర్మించు-నిర్వహించు-బదిలీ) పద్ధతిలో రెండు జాతీయ రహదారి ప్యాకేజీలను నిర్వహిస్తున్న స్వర్ణ టోల్‌వే ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌టీపీఎల్)ను, అదానీ గ్రూపు సంస్థ అయిన అదానీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్ (ఏఆర్‌టీఎల్) సొంతం చేసుకోనుంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. స్వర్ణ టోల్‌వే ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లారీ బీభత్సం... ఇద్దరు మహిళలు మృతి.. ఎక్కడంటే..?
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ఘోరంగా ఇద్దరి ప్రాణాలు బలిగొంది. పెన్నా నది వంతెన పై నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మిదేవి(46), సరస్వతి(45)గా అనే మహిళలపైకి లారీ దూసుకెళ్లడంతో ఇద్దరి అక్కడికక్కడే మృతిచెందారు. శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మూడేళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి?.. ప్రశ్నించిన యువకుడిపై ఎమ్మెల్యే కేసు
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో నిర్వహించిన గడపగడపకూ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేపనపల్లె గ్రామంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పర్యటిస్తున్న సమయంలో.. ఒక యువకుడు తమ గ్రామానికి ఏమి చేశారని ప్రశ్నించాడు. విద్యాదీవెన కూడా సక్రమంగా రావడం లేదని ఎమ్మెల్యేను నిలదీశాడు. అక్కడే ఉన్న పోలీసులు యువకుడి అదుపులోకి తీసుకోవడంతో.....గ్రామస్తులు అడ్డుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'దేశంలో ఆ ఇద్దరి 'నియంత' పాలన.. ప్రశ్నిస్తే దాడులే!'
ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతోందని అన్నారు. ఇద్దరు-ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ఇద్దరు కలిసి దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు రాహుల్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. జపాన్‌లో 2 లక్షలకు పైనే!