- కుప్పంలో వైకాపా కార్యకర్తల వీరంగం, అన్న క్యాంటీన్ ధ్వంసం
పోటాపోటీగా వైకాపా, తెదేపా ర్యాలీలు, తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జీతో కుప్పం పట్టణం రణరంగమైంది. ఓ వైపు చంద్రబాబు పర్యటన సాగుతుండగానే వైకాపా చేపట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతించారు. ర్యాలీ సందర్భంగా వైకాపా శ్రేణులు సృష్టించిన విధ్వంసం కుప్పం పట్టణం అట్టుడికేలా చేసింది. కుప్పం వీధుల్లో వైకాపా వీరంగం తెలుగుదేశం బ్యానర్లు, జెండాలు ధ్వంసం, అన్న క్యాంటీన్ విధ్వంసం వంటి వరుస ఘటనలతో ప్రశాంతతకు నిలయమైన కుప్పం పట్టణం అలజడులకు నిలయంగా మారింది.
- ప్రభుత్వ చర్యలతో చేనేత ఉత్పత్తుల ఆదాయం మూడింతలు పెరిగిందన్న సీఎం జగన్
లంచాలు, వివక్ష లేకుండా నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా చేశామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఇప్పటివరకు రూ.776 కోట్లు అందించామని.. ప్రతి నేతన్న కుటుంబానికి రూ.96 వేలు ఇచ్చామని వెల్లడించారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు.
- కేంద్రాన్ని సరిగ్గా అడిగి ఉంటే విభజన హామీలన్నీ గతంలోనే పూర్తయి ఉండేవి
కేంద్రాన్ని సరిగ్గా అడిగి ఉంటే విభజన హామీలన్నీ గతంలోనే పూర్తై ఉండేవని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన అంశాలు, ఆర్థిక సంబంధిత అంశాలపై ఇవాళ దిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక వనరులు లేకుండా చూడాలని తెదేపా ప్రయత్నాలు చేస్తోందని బుగ్గన ఆరోపించారు.
- సెప్టెంబరు 1న కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపడతామన్న ఏపీఎన్జీవో
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏపీఎన్జీవో అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. మినిమం స్కేల్ ఇచ్చినా సర్వీసు రెగ్యులరైజ్ చేయలేదని, తెలంగాణ ప్రభుత్వ తరహాలో ఏపీ ప్రభుత్వం కుడా చర్యలు తీసుకోవాలని సూచించారు.
- ఝార్ఖండ్ సీఎంకు బిగ్ షాక్, అనర్హత వేటుకు ఈసీ సిఫార్సు, నెక్ట్స్ సీఎం ఎవరంటే
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్ రమేశ్ బైస్‌కు ఈసీ నివేదిక సమర్పించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్లు తెలుస్తోంది. సీల్డు కవరులో నివేదికను రాజ్‌భవన్‌కు పంపినట్లు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.
- ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ భేటీ, కొందరు మిస్, భాజపా పనేనా
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను భాజపా తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 62 మంది ఆప్ ఎమ్మెల్యేలకుగాను 53 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. భారతీయ జనతా పార్టీ చేసిన ఆపరేషన్ కమలం విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది.
- కరోనా, మంకీపాక్స్, హెచ్ఐవీ మూడూ ఒకేసారి, ఒకే వ్యక్తికి
కరోనా మహమ్మారి, మంకీపాక్స్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి ఒకే సమయంలో కరోనా వైరస్, మంకీపాక్స్,హెచ్ఐవీ సోకినట్లు తేలడం కలకలం రేపింది.
- భారీగా పెరిగిన బంగారం ధర, ఏపీ తెలంగాణలో ఎంతంటే
దేశంలో గురువారం బంగారం ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- అదుర్స్ అనిపించేలా ది ఘోస్ట్ ట్రైలర్, ఫుల్ యాక్షన్ మోడ్‌లో నాగార్జున
నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్. ఈ సినిమా ట్రైలర్‌ని విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ ఆడుతున్న థియేటర్లలో గురువారం ఉదయం ప్రదర్శించారు. తాజాగా నటుడు మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
- ఆసియా కప్‌లో అందరి కళ్లూ వీరిపైనే, ఆటతో అదరగొడతారా మరి
ఆసియా కప్‌కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. 2016 తరహాలో ఈసారి కూడా టీ 20 ఫార్మాట్లో జరగనుందీ టోర్నీ. శ్రీలంక, అఫ్గానిస్థాన్ పోరుతో ఆసియా కప్ ఆగస్టు 27న ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 28న ఆడనుంది. టోర్నీలో మొత్తం ఆరు జట్లు తలపడనుండగా.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై అందరి దృష్టి నెలకొంది. ఓ సారి వాళ్ల గురించి తెలుసుకుందాం.
ఏపీ ప్రధాన వార్తలు