బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు భారీ వర్షాలు!
మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతవారణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
నెల్లూరులో భార్యాభర్తలు, కుమార్తె మృతి.. ఏం జరిగింది?
నెల్లూరు జిల్లాలో భార్యాభర్తలతోపాటు చిన్నారి మృతిచెందారు. తల్లీ కూతురి శవాలు ఓ గదిలో ఉండగా.. ఆత్మహత్య చేసుకున్న స్థితిలో భర్త మృతదేహం మరో గదిలో ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది? ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఒక్కపైసా ఇవ్వొద్దు.. సీఎంకు ఫిర్యాదు చేద్దాం: అన్నెం
బాపట్ల నియోజకవర్గంలో అరాచక పాలన నడుస్తోందని.. కోన రఘుపతి, స్థానిక అధికారులు ప్రజల్ని బెదిరిస్తున్నారని భాజపా మాజీ ఎమ్మెల్సీ అన్నెం సతీశ్ ఆరోపించారు. నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోవాలంటే లంచం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
అది అందమైన అబద్ధం.. వాళ్లు జగన్ను నమ్మరు: అచ్చెన్న
రాష్ట్రంలో కొనసాగుతున్నంత చెత్త పాలన చరిత్రలోనే లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఉద్యోగుల జీతాలను ప్రతినెలా ఆలస్యంగా చెల్లిస్తూ.. సాంకేతిక సమస్య అంటున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు ఇక సీఎం జగన్ను నమ్మే పరిస్థితిలేదని అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రపంచానికే భారత్ దిక్సూచి.. ముందు వాటిపై దృష్టి పెట్టండి: మోదీ
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పంటల్లో వైవిధ్యం కనబరచాలని, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. 2047 లక్ష్యాల గురించి వివరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.