- CM Jagan: 15 రోజుల్లో వరద నష్టం గణన పూర్తి
‘గోదావరి వరదలతో ముంపునకు గురైన కుటుంబాల్లో ప్రతి ఇంటికీ 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు, రూ.2వేల సాయం అందించాం. పశువులకు నోరుంటే అవీ మెచ్చుకునేలా వాటినీ చూసుకోవాలని ఆదేశాలిచ్చి.. ఆదుకున్నాం’ అని సీఎం జగన్ చెప్పారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఊడిమూడిలంక, బూరుగులంకలో.. రాజోలు మండలం మేకలవారిపాలెం, తాటిపాకమఠం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కర్నూలులో కారు-లారీ ఢీకొని ముగ్గురు మృతి
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద కారు, లారీ ఢీకొని ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సోమశేఖర్, గణేష్, రుద్రగా గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీఎం జగన్ పెన్ను లాగేసిన చిన్నారి.. ఆ తర్వాత
కోనసీమ జిల్లాలోని గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పి.గన్నవరం మండలం జి. పెదపూడిలంకలో వరద బాధితులను పరామర్శించిన జగన్.. ఓ ఎనిమిది నెలల చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకున్నాడు. అనంతరం అక్కడి వరద బాధితులతో మాట్లాడుతుండగా చిన్నారి విజయ చైతన్య సీఎం జగన్ జేబులో పెన్నును లాగేశాడు. పెన్ను కింద పడిపోగా.. భద్రతా సిబ్బంది తీసి జగన్‌కు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మన్యం జిల్లాలో విష జ్వరాలు
పార్వతీపురం మన్యం జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. బాధితులు భారీ సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రతీ రోజు 200 మందికి పైగా వస్తుండగా వారిలో 50 నుంచి 60 మంది ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పిడుగుపాటుకు 40 మంది బలి.. పశువుల్ని మేపుతూ అక్కడికక్కడే..!
మంగళవారం ఒక్కరోజే పిడుగుపాటుకు 20 మంది మరణించిన ఘటన బిహార్‌లో జరిగింది. 8 జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. యూపీలో రెండు రోజుల వ్యవధిలో 18 మంది చనిపోయారు. ఝార్ఖండ్‌లోనూ పిడుగుపాటుతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒక్క నెల కరెంట్ బిల్లు రూ.3వేల కోట్లు.. ఆస్పత్రిలో ఇంటి ఓనర్!