ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM - ఏపీ ప్రధాన వార్తలు

.

ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Jul 26, 2022, 7:00 PM IST

  • Botsa: 'హెడ్డింగ్​లు మారినా.. నా భావాలు తెలిపినందుకు ధన్యవాదాలు'
    విధాన నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఉపాధ్యాయులకు లేదంటూ సోమవారం తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ సమర్థించుకున్నారు. హెడ్డింగ్​లు అటు ఇటు మారినా.. తన భావాలను ప్రజలకు తెలిపారంటూ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Live Video: అందరూ వద్దన్నా వెళ్లాడు.. వాగులో కొట్టుకుపోయాడు... కానీ..
    ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును చూసి అందరూ.. భయపడుతుంటే ఒక్కడు మాత్రం ఆ వరదకే సవాలు విసురుతూ వాగు దాటే ప్రయత్నం చేశాడు. ఒడ్డున ఉన్నవాళ్లు ఊహించినట్టుగానే.. నాలుగు అడుగులు వేసాడో లేదో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతనికి ఈ భూమ్మీద నూకలు ఇంకా మిగిలున్నట్లుంది. అదృష్టం కొద్దీ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా సైక్లోనిక్ సర్కూలేషన్‌'.. అమరావతి వాతావరణ కేంద్రం
    మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ కోస్తాంధ్ర, తెలంగాణాల మీదుగా సైక్లోనిక్ సర్కులేషన్ కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రోడ్డు రోలర్​తో తొక్కించి.. రూ.2 కోట్ల విలువైన మద్యం ధ్వంసం
    విజయవాడ కమిషనరేట్ పరిధిలో సుమారు రూ.2 కోట్ల విలువైన 62 వేల మద్యం సీసాలను పోలీసులు రోడ్డు రోలర్​తో తొక్కించి ధ్వంసం చేశారు. విదేశీ మద్యం సీసాలు కూడా ధ్వంసమైన వాటిలో ఉన్నాయని కమిషనర్ కాంతిరాణా తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • శబరిమల ఆలయంలో అనూహ్య సమస్య- యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్న అధికారులు!
    ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయ గర్భగుడిలో నీరు లీకవుతోంది. బంగారు తాపడం చేసిన పైకప్పు నుంచి నీరు లీకవుతున్నట్లు గుర్తించిన ట్రావన్​కోర్​ దేవస్థాన అధికారులు మరమ్మత్తు పనులను ప్రారంభించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఒకేసారి స్టేషన్​లోని 66 మంది పోలీసులు బదిలీ.. కారణమిదే..
    పోలీస్​ కస్టడీ నుంచి విడుదలైన వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన కేసులో కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న స్టేషన్ హౌస్​​ ఆఫీసర్ సహా 66 మంది పోలీసులను బదిలీ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • చెస్​ ఆడుతుండగా రోబో 'పైశాచికం'.. పిల్లాడి వేలు విరిచేసిన చిట్టి!
    ఏడేళ్ల బాలుడితో చెస్​ ఆడుతున్న రోబో.. ఒక్కసారిగా ఆ పిల్లాడి వేలు విరిచేసింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారు ఖంగుతిన్నారు. రోబో చెర నుంచి బాలుడ్ని విడిపించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు వివో కుట్ర!'
    ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ వివో మనీలాండరింగ్ వ్యవహారాన్ని.. దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే కుట్రగా అభివర్ణించింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్. ఆ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడాన్ని సమర్థించుకుంటూ దిల్లీ హైకోర్టులో ఈడీ ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Tollywood: ఆ ఎనిమిది కీలక అంశాలపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం
    తెలుగు సినీ నిర్మాతల కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి థియేటర్‌లో విడుదలైన భారీ చిత్రాలు పదివారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • టీ20 సిరీస్​.. కెప్టెన్​ రోహిత్​ రెడీ.. కానీ ఆ స్టార్​ ఓపెనర్​ మాత్రం..
    ఈ నెల 29 నుంచి విండీస్​తో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం కెప్టెన్​ రోహిత్​ శర్మ సిద్ధమయ్యాడు. రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లతో కలిసి అతడు ట్రినిడాడ్‌ చేరుకొన్నాడు. అయితే ఈ సిరీస్​కు స్టార్​ ఓపెనర్​ కేఎల్​ రాహుల్ మిస్​ అయ్యాడు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details