- ప్రైవేటు బడులకు పుస్తకాలెక్కడ?.. మార్కెట్లో దొరక్క తల్లిదండ్రుల అవస్థలు!
ప్రైవేటు పాఠశాలలు సైతం పాఠ్యపుస్తకాలను తమ వద్దే కొనాలంటూ నిబంధన తెచ్చిన పాఠశాల విద్యాశాఖ.. సరఫరాపై మాత్రం దృష్టిపెట్టడం లేదు. దీంతో పాఠ్యపుస్తకాలు లేకుండానే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.. పాఠశాలలు పునఃప్రారంభించి మూడు వారాలు కావొస్తున్నా ప్రైవేటు పాఠశాలలకు ఇప్పటికీ పుస్తకాలు అందలేదు. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రాష్ట్రం నుంచి హైదరాబాద్కు 'అక్రమంగా' ఇసుక.. వయా వత్సవాయి!
రాష్ట్రం నుంచి ఇసుక లోడుతో ఉన్న లారీలు హైదరాబాద్కు భారీగా తరలివెళ్తున్నాయి. తెలంగాణ-ఆంధ్ర సరిహద్దులోని గరికపాడు తనిఖీ కేంద్రం దాటితే వాటిని అడ్డుకునేవారే ఉండటం లేదు. దీంతో జాతీయ రహదారి పక్కనున్న మండలమైన వత్సవాయిలోని గ్రామాలకు ఇసుక సరఫరా చేస్తున్నామని వే బిల్లుల్లో చూపించి.. అటు నుంచి అటే హైదరాబాద్ తరలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఆహార భద్రత కార్డుల్లో భారీ మార్పుచేర్పులు.. ఉత్తరాంధ్ర, సీమలో అధికంగా!
జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డుల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున మార్పుచేర్పులు చేసింది. మొత్తం కార్డులు, లబ్ధిదారుల సంఖ్యను గతంలో మాదిరిగా కొనసాగిస్తూనే.. జిల్లాల పరిధిలో మార్పులు చేసింది. జులై వరకు ప్రతి జిల్లాలో సగటున 50 నుంచి 60% కార్డులు ఎన్ఎఫ్ఎస్ఏ పరిధిలో ఉన్నాయి. ఆగస్టు నుంచి 12 జిల్లాల్లో వాటిని 30% కన్నా తగ్గించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఆటోను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి, మరో ఇద్దరికి గాయాలు
కర్నూలు సమీపంలోని వెల్దుర్తి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి డోన్ వైపు వెళ్తున్న కారు ఆటోను ఢీకొట్టగా.. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ముర్ము ప్రమాణానికి సర్వం సిద్ధం.. ఆదివాసీ సంప్రదాయాలతో వైభవంగా..
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు (సోమవారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం సైనికులు.. ముర్ముకు '21 గన్ సెల్యూట్' సమర్పిస్తారు. సైనిక వందనం స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి హోదాలో ముర్ము ప్రసంగిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'పర్యావరణాన్ని కాపాడుకుందాం.. సామాన్యులే నిజమైన దేశ నిర్మాతలు'