- గడపగడపకు నిలదీతలు.. వైకాపా ఎమ్మెల్యేకు చేదు అనుభవం
గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తప్పటం లేదు. ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేలను, మంత్రులను ఎక్కడిక్కడ నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా.. కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం దిండి గ్రామంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ను మహిళలు తమ సమస్యలపై నిలదీశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- యానాంలో డీఎంకే బృందం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో డీఎంకే ఎమ్మెల్యేల బృందం వరద నష్టాన్ని పరిశీలించింది. వరద ముంపు ప్రాంతాలకు ట్రాక్టర్‌పై వెళ్లి స్థానికులను పరామర్శించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ చిత్రంలో లాగే నేనూ అవమానాలు పడ్డా.. హీరో కావాలనుకొని డైరెక్టర్‌నయ్యా'
కలర్ ఫోటో చిత్రంలో లాగే తనూ ఎన్నో అవమానాలుపడ్డాడని.. అందుకే సున్నితమైన అంశాన్ని కథాంశంగా ఎంచుకున్నానని ఆ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ తెలిపారు. మొదటి సినిమాకే జాతీయ స్థాయి అవార్డ్ దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ గోడ నిర్మాణం కోసం అక్రమ కట్టడాల కూల్చివేత
కడప రవీంద్రనగర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతతో ఉద్రిక్తత నెలకొంది. బుగ్గ వంక పరిసర ప్రాంతాలలో రక్షణ గోడ నిర్మాణం కోసం.. పోలీసులు, రెవిన్యూ అధికారులు ప్రొక్లెయిన్లతో అక్రమ కట్టడాలను తొలగించేందుకు వచ్చారు. పట్టాలు ఉన్నా అధికారులు తమ నివాసాలను కూల్చివేస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ముర్ము ప్రమాణానికి సర్వం సిద్ధం.. ఆదివాసీ సంప్రదాయాలతో వైభవంగా..
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో.. ఆమె ప్రమాణస్వీకారం జరగనుంది. అనంతరం ముర్ము రాష్ట్రపతి హోదాలో ప్రసంగిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇంట్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 50మీటర్ల దూరంలో శరీరభాగాలు!
పేలుడు సంభవించి ఇల్లు కుప్పకూలిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బిహార్‌లోని ఛాప్రాలో జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- Fact Check: మంకీపాక్స్ 'బిల్ గేట్స్ కుట్ర' అంటూ దుష్ప్రచారం.. ఇదీ అసలు నిజం!
ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్న 'మంకీపాక్స్' వైరస్.. వ్యాపార దిగ్గజం బిల్ గేట్స్ ఆదాయార్జన కోసం చేసిన కుట్ర అంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం అసత్యమని 'ఈటీవీ భారత్ ఫ్యాక్ట్ చెక్'లో తేలింది. 1958లోనే తొలిసారి ఈ వైరస్ వెలుగులోకి వచ్చిందని, అప్పటి నుంచే అనేక దేశాలు మంకీపాక్స్‌పై పోరు సాగిస్తున్నాయని అధికారిక పత్రాల పరిశీలన ద్వారా నిర్ధరణ అయింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు...పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రాష్ట్రాల కోరిక మేరకే వాటిపై జీఎస్టీ.. నిర్ణయం కేంద్రానిది కాదు'
రాష్ట్రాలు చేసిన అభ్యర్థన ప్రకారమే ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. జీఎస్టీ విధించాలన్న నిర్ణయం జీఎస్టీ మండలి ఏకాభిప్రాయంతో తీసుకుందని, అందులో అన్ని రాష్ట్రాలు భాగమేనని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఇంద్ర' @20 ఇయర్స్.. ఆ డైలాగ్‌లను అలా రాశారు!
చిరంజీవి ఎవర్గ్రీన్ హిట్స్ జాబితా చెప్పండి అంటే ఈ తరం వాళ్లు ఠక్కున చెప్పే పేరు 'ఇంద్ర'. వరుస పరాజయాల తర్వాత చిరును మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చిన సినిమా ఇది. డ్యాన్సులు, ఫైట్లు, లుక్స్ ఇలా అన్నింటిలోనూ అభిమానులు కొత్త చిరంజీవిని చూశారు. థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- అలా చేస్తేనే టెస్టుకు ఆదరణ పెరుగుతుంది: రవిశాస్త్రి
టెస్టు క్రికెట్‌కు మరింత ఆదరణ తెచ్చేందుకు టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. అవేంటంటే...పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS