రామాయపట్నం పోర్టుతో మెరుగైన ఉద్యోగావకాశాలు: సీఎం జగన్
రామాయపట్నం పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని సీఎం జగన్ అన్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మొండివారిపాలెంలో పోర్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన సీఎం..రాష్ట్రంలో ఉన్న ఆరు పోర్టులకు తోడు మరో నాలుగు ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలోనే మిగిలిన వాటికీ భూమి పూజ చేస్తామని చెప్పారు.
రాష్ట్రం శ్రీలంక దిశగా సాగుతోందని కేంద్రం కూడా చెప్పింది: పయ్యావుల
రాష్ట్రంలోనూ శ్రీలంక పరిస్థితులు నెలకొంటాయని 4 నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ హెచ్చరించిందని... అదే విషయాన్ని నిన్న కేంద్రం మరోసారి తెలిపిందని పయ్యావుల కేశవ్ వివరించారు.
CPI Narayana: చిరంజీవిపై వ్యాఖ్యలు.. సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం
ప్రముఖ సినీనటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యకమవుతున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని చిరంజీవి అభిమానులకు నారాయణ విజ్ఞప్తి చేశారు.
తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్బ్యాంకు ఎన్నికలపై.. హైకోర్టు సీజేకు ఫిర్యాదు
తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు ఎన్నికలపై హైకోర్టు సీజేకు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఫిర్యాదు చేశారు. అన్యాయంగా తమను పోలీసులు నిర్బంధించారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీజేను కోరారు.
జీఎస్టీ బాదుడుపై విపక్షాల నిరసన.. ఉభయ సభలు వాయిదా
లోక్సభ గురువారానికి వాయిదా పడింది. ధరల పెరుగుదల, రోజువారీ వస్తువులపై జీఎస్టీ విధింపునకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేస్తుండటం వల్ల సభాకార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది.