ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@ 9AM - ఏపి టాప్ న్యూస్

.

top news
top news

By

Published : Jul 17, 2022, 9:14 AM IST

Updated : Jul 17, 2022, 9:23 AM IST

  • Grieving godavari farmer: రైతులకు కడగండ్లు మిగిల్చిన గోదావరి వరదలు
    (Grieving farmers) గోదావరి వరద రైతులకు కడగండ్లు మిగిల్చింది. చేతికొచ్చిన పంట మొత్తం నీటిపాలైంది. లక్షలాది రూపాయల పెట్టుబడితో రైతు కష్టమంతా వరద నీటిలో కొట్టుకుపోయింది. అరకొరగా దక్కిన పంటను అందినకాడికి అమ్ముకుందామన్నాకొనే దిక్కే లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • AP Floods: దారి తెలియని నిస్సాహయ స్థితిలో గోదారి వరద బాధితులు
    వర్షాలు తగ్గినా ఉగ్ర గోదావరి ఉరకలేస్తూ గోదావరి జిల్లాల్లో ఊళ్లు, లంకలను ఏకం చేస్తూనే ఉంది. వరద నీరు ఇళ్లను ముంచెత్తడంతో బాధితులు మూటాముల్లె సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. పోలవరం ముంపు, విలీన గ్రామాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు గోదావరి వరద రైతులకు కడగండ్లు మిగిల్చింది.చేతికొచ్చిన పంట మొత్తం నీటిపాలైపోయింది. లక్షలాది రూపాయల పెట్టుబడి, రైతు కష్టం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Ramayam port: ఈ నెల 20న నెల్లూరు జిల్లాలో రామాయపట్నం ఓడరేవుకు సీఎం జగన్‌ శంకుస్థాపన
    (Ramayampatnam port) ఈ నెల 20న నెల్లూరు జిల్లా రామాయపట్నం ఓడరేవుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబందించి స్థానిక ఎమ్మెల్యే, అధికార్లు కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • High Court: పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు చట్టబద్ధతే లేదు
    High Court: చట్టబద్ధత లేని ఏపీ పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ (పీఎస్‌వో) ఆధారంగా రౌడీషీట్‌ తెరవడం, వాటిని కొనసాగించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రౌడీషీట్‌ తెరవడం, నిఘా పెట్టడం, ఠాణాల్లో ఫొటోల ప్రదర్శన సరికాదని పేర్కొంది. ఆ చర్యలు గోప్యత హక్కును హరించడమేనని తేల్చిచెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • హడావుడిగా పాక్​లో ల్యాండైన భారత విమానం.. హైదరాబాద్​కు​ వస్తుండగా!
    Indigo Flight Diverted: షార్జా నుంచి హైదరాబాద్​ వస్తున్న ఇండిగో ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం పాకిస్థాన్​లోని కరాచీ ఎయిర్​పోర్ట్​లో ల్యాండయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమైన పైలట్​.. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఎయిర్​లైన్స్​ ఓ ప్రకనటలో తెలిపింది. ప్రయాణికుల్ని హైదరాబాద్​ రప్పించేందుకు మరో విమానాన్ని పంపినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Neet Exam: దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సర్వం సిద్దం
    Neet Exam: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ జరగనుంది. రాష్ట్రం నుంచి సుమారు 60వేల మంది అభ్యర్థుల కోసం.. 25 పట్టణాలు, నగరాల్లో.. 115 కేంద్రాలను సిద్దం చేశారు. ఈ ఏడాది పరీక్ష సమయాన్ని 20 నిమిషాలు పెంచారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు నిర్వహించనున్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఎన్​టీఏ వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • చైనా దూకుడుకు కళ్లెం.. 'ఆకస్​' నెక్ట్స్​ టార్గెట్​ భారత్​.. మళ్లీ తెరపైకి ఖలిస్థాన్​ వాదం..
    చైనాకు కళ్లెం వేసేందుకు ఏర్పడిన 'ఆకస్' కూటమి భారత్​పై అక్కసు వెళ్లగక్కుతోంది. భారత్​లో మైనారిటీల హక్కులకు భంగం వాటిల్లుతోందని విమర్శిస్తోంది. ఆకస్ కూటమిలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలు. భారత్‌లో మతస్వేచ్ఛకు భంగం కలుగుతోందంటూ అమెరికా మొసలి కన్నీరు కారుస్తుంటే- బ్రిటన్‌, ఆస్ట్రేలియాల్లో సిక్కు వర్గానికి చెందిన కొందరు ఖలిస్థాన్‌ వాదాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'పెరుగుతున్న గిరాకీ.. ఎంఎన్​సీల చూపు భారత్​ వైపు.. 2030 నాటికి అలా..'
    భారత్​లో ఫార్మాస్యూటికల్ మార్కెట్ రాబోయే దశాబ్దంలో దూసుకెళ్తుందని అన్నారు పరాక్సెల్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ వ్యాస్‌. ప్రస్తుతం 44 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ 2030 నాటికి 130 డాలర్లుకు చేరుకుంటుందని తెలిపారు. దీని వల్ల దేశీయంగా కాంట్రాక్టు పరిశోధనా సేవలకు గిరాకీ ఎంతగానో పెరుగుతుందని వెల్లడించారు. పరాక్సెల్ ఎండీ సంజయ్ వ్యాస్ 'ఈనాడు'తో పలు విషయాలు ముచ్చటించారు. వాటి గురించి తెలుసుకుందాం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • భారత అథ్లెట్​ అద్భుతం.. పతకంతో ఫెలిక్స్​ అల్విదా!
    World athletics championships 2022: ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో భారత క్రీడాకారుడ మురళీ శ్రీశంకర్​ అదరగొట్టాడు. లాంగ్​జంప్​​ అర్హత రౌండ్లో 8 మీటర్లు దూకి ఫైనల్​కు చేరాడు. ఇతర భారత అథ్లెట్లు జెస్విన్‌ అల్డ్రిన్‌, మహ్మద్‌ అనీస్‌ అర్హత రౌండ్లోనే నిష్క్రమించారు. మరోవైపు అమెరికా దిగ్గజ అథ్లెట్‌ అలిసన్‌ ఫెలిక్స్‌ తన ఉజ్వల కెరీర్‌కు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకంతో వీడ్కోలు పలికింది. మిక్స్​డ్​ రిలే రేసులో కాంస్యం అందుకుంది ఫెలిక్స్.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఆయన ఫోన్‌ చేస్తే నమ్మలేకపోయా.. అదే నా డ్రీమ్​.. నాకు కోపం వస్తే'
    Krithi shetty: కృతిశెట్టి.. బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అందం, అభినయంతో ఆకట్టుకుని టాలీవుడ్​లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా 'ది వారియర్'​ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్భంగా తన కెరీర్​, అనుభవాలు, వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను పంచుకుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Last Updated : Jul 17, 2022, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details