ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @7AM - ఏపీ ప్రధాన వార్తలు

..

ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Jul 4, 2022, 7:05 AM IST

  • నేడు భీమవరంలో ప్రధాని మోదీ, సీఎం జగన్ పర్యటన

సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధానితోపాటు సీఎం పాల్గొననున్నారు. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు ముఖ్యమంత్రి బయలుదేరతారు. 10.10 గంటలకు హైదరాబాద్​ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ చేరుకోనున్న ప్రధాని నరేంద్రమోదీకి.. స్వాగతం పలుకుతారు. 10.15 గంటలకు సీఎం గన్నవరం నుంచి భీమవరం బయలుదేరనున్నారు.

  • అల్లూరి 125వ జయంతి.. విగ్రహావిష్కరణ చేయనున్న ప్రధాని

మన్యం వీరుడు, విప్లవ నిప్పుకణిక అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలకు సర్వం సిద్ధమైంది . ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా విప్లవ వీరుడి గొప్పదనాన్ని భావితరాలకు తెలియజెప్పే లక్ష్యంతో ….పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేడు అల్లూరి విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి , పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

  • నేతల ఆశీస్సులుంటే.. నచ్చిన చోటుకు బదిలీలు.. లేకుంటే..

రాష్ట్రవ్యాప్తంగా 47 మంది పురపాలక కమిషనర్లను ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చుకున్నవారు నచ్చిన చోటుకు బదిలీ అయ్యారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేల మాట వినని పలువురు కమిషనర్లను బదిలీ చేసి పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా గాలిలో పెట్టడం బదిలీలపై నేతలకున్న పట్టును స్పష్టం చేసింది.

  • ఎంపీ రఘురామ భీమవరం పర్యటన రద్దు.. కారణం అదేనా..!

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు చేసుకున్నారు. రైలులో నర్సాపురం బయల్దేరిన రఘురామ.. బేగంపేట స్టేషన్​లో దిగి హైదరాబాద్​లోని తన ఇంటికి వెళ్లిపోయారు. అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా భీమవరం రావాల్సి ఉన్న తాను పర్యటనను రద్దు చేసుకున్నట్లు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. భీమవరంలో ఉన్న తన అనుచరులతో పాటు మరికొందరిని స్థానిక పోలీసులు బైండోవర్ల పేరిట స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా హింసించారని రఘురామ ఆరోపించారు.

  • ముఖ్యమంత్రిని కాల్చేస్తా.. మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక

కేరళ సీఎంను తుపాకీతో కాల్చేస్తానని బహిరంగంగా బెదిరింపులు చేశారు ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే భార్య. తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని.. దీని వెనుక సీఎం హస్తం ఉందని ఆమె ఆరోపించారు.

  • ఇంట్లో జారిపడ్డ లాలూ! భుజం, వెన్నెముకకు గాయాలు

ఆర్​జేడీ అధినేత, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ గాయపడ్డారు. పట్నాలోని తన సతీమణి రబ్రీదేవి నివాసంలో ఉంటున్న ఆయన.. మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డారు. ఈ క్రమంలో ఆయన భుజం విరిగింది.

  • డెన్మార్క్‌లో కాల్పుల మోత.. పలువురు దుర్మరణం

డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగెన్‌ తుపాకీ కాల్పుల మోతతో దద్ధరిల్లింది. రద్దీగా ఉన్న షాపింగ్‌ మాల్‌లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీ కాల్పులు అరుదుగా జరిగే డెన్మార్క్‌.. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

  • ఈ పోస్టాఫీస్​ పొదుపు పథకాలు తెలుసా? వడ్డీ రేటు 7% పైనే!

Post Office Savings Schemes: రిజర్వ్​ బ్యాంకు రెపో రేటును పెంచిన తర్వాత.. ఎస్​బీఐ, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్​ బ్యాంక్​ వంటి ప్రముఖ బ్యాంకులు ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అయినా కూడా మంచి రాబడిని అందించలేకపోతున్నాయని అంటున్నారు నిపుణులు. వీటితో పోలిస్తే.. పోస్టాఫీస్​ పథకాలు కొన్ని లాభదాయకంగా ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో చూడండి.

  • చెలరేగిన బౌలర్లు.. భారత్‌కు భారీ ఆధిక్యం.. సిరీస్​ మనదేనా?

Ind vs Eng Test Match: గతేడాది 2–1తో ఆగిపోయిన ఐదు టెస్టుల సిరీస్‌ 3–1తో తమ వశమయ్యే దిశగా భారత్‌ అడుగులేస్తోంది. ఇంగ్లండ్‌ బ్యాటర్లను భారత్​ క్రికెట్​ జట్టు బౌలర్లు కట్టడి చేయడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 300 పరుగుల్లోపే ఆలౌటైంది. దీంతో భారత్‌కు 132 పరుగుల ఆధిక్యం లభించగా, రెండో ఇన్నింగ్స్‌లో పుజారా అర్ధసెంచరీతో టీమ్​ఇండియా ఆధిక్యం 257 పరుగులకు చేరుకుంది.

  • జోరు తగ్గించిన భామలు.. అవకాశాల్లేవా?.. ఆచితూచి అడుగులా?

సీనియర్‌ భామలు.. కొత్తతరం తారలే కాదు.. చిత్రసీమలో మరో శ్రేణి కథానాయికలూ కనిపిస్తుంటారు. వీళ్లు అటు స్టార్‌ కథానాయకుల చిత్రాల్లో సందడి చేస్తుంటారు, ఇటు యువ హీరోలతోనూ జట్టు కడుతుంటారు. సినిమాలో రెండో కథానాయికకి చోటు ఉందన్నప్పుడు దర్శకనిర్మాతలకి గుర్తొచ్చే భామలు వీళ్లే. వీరిలో కొద్దిమంది అప్పుడప్పుడూ ప్రత్యేక గీతాలతోనూ సందడి చేస్తుంటారు. ఇలా దేనికైనా రెడీ అంటూ ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో బిజీగా ఉండే ఈ భామలు అనూహ్యంగా జోరు తగ్గించారు.

ABOUT THE AUTHOR

...view details