- ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. దాడులతో బెదిరిస్తారా? : చంద్రబాబు
రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా సర్కారు పనితీరును ప్రశ్నిస్తే.. దాడులు చేసి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Pawan Kalyan: సంపూర్ణంగా మద్యం మీదే ప్రభుత్వ ఆదాయం: పవన్ కల్యాణ్
రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు 'కాదు కాదు' సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్లో జోడించారు.
- ఇప్పటికే ముగ్గురు చనిపోయారు.. మిగిలిన వారినైనా కాపాడండి: రఘురామ
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు సాక్షులు చనిపోయారని.. మిగిలిన వారినైనా కాపాడాలని కోరారు. వివేకా కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నగంగాధర్ రెడ్డి మృతిపై ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు.
- ప్రాణం తీసిన పబ్జీ.. ఆటలో ఓడిపోయానని దారుణ నిర్ణయం..!
డిప్రెషన్.. బుద్ధిమాంద్యం.. విచిత్ర ప్రవర్తన.. వంటి మానసిక రోగాలే బహుమతులుగా నిర్ణయించబడిన ఈ మొబైల్ గేమ్స్‌లో.. ఆత్మహత్య చేసుకోవడమే ఫస్ట్ ప్రైజ్! ఇలాంటి రాక్షస క్రీడల్లో ప్రథమ స్థానంలో ఉన్న పబ్జీ గేమ్‌కు.. మరో పసివాడు బలైపోయాడు..! కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన ఈ దారుణ సంఘటన.. కుటుంబంలో తీరని విషాదం నింపితే.. స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.
- రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం? రంగంలోకి రాజ్‌నాథ్, నడ్డా!
రాష్ట్రపతి ఎన్నికల కసరత్తును భాజపా ముమ్మరం చేసింది. ఈ ఎన్నికల బాధ్యతలను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది.
- రూ.1.5లక్షల కోట్లతో 114 యుద్ధ విమానాలు.. ప్రత్యర్థి దేశాలకు హడల్!
గగనతలంలో ప్రత్యర్థి దేశాలు చైనా, పాకిస్థాన్‌పై పైచేయి సాధించేందుకు 114 ఆధునిక యుద్ధ విమానాలను సమకూర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం లక్షన్నర కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో వీటిలో 96 యుద్ధ విమానాలను భారత్‌లోనే తయారు చేస్తారు. కేవలం 18 యుద్ధ విమానాలను మాత్రమే విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకోనున్నారు.
- యుద్ధం వస్తుందని చెబితే జెలెన్స్కీ వింటే కదా?: బైడెన్
భారీ స్థాయిలో ప్రాణ నష్టం కలిగించే ఆయుధాలను ఉక్రెయిన్‌పై ప్రయోగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సమాలోచన చేస్తున్నట్లు హెచ్చరికలు వస్తున్నాయి. పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టాలే ధ్యేయంగా పుతిన్ వ్యూహం రచిస్తున్నారని బ్రిటన్, ఉక్రెయిన్ అంచనా వేస్తున్నాయి. మరోవైపు యుద్ధం వస్తుందని చెప్పినా.. జెలెన్స్కీ వినలేదని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
- ఆరోగ్య బీమా ఆగిపోకుండా ఉండాలంటే?
పూర్తిస్థాయి ఆరోగ్య బీమా అవసరం ఏమిటో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనారోగ్యంలో ఆర్థికంగా భారం కాకుండా.. ఈ పాలసీ తోడుంటుంది. మారుతున్న వైద్య అవసరాలకు తగ్గట్టుగా ఇప్పుడు వస్తున్న వైద్య పాలసీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇలాంటి ప్రత్యేకతల్లో.. రీస్టోరేషన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- 'నాకు అమ్మ లేదు.. అన్నీ ఇంద్రజ గారే.. నా కార్ కోసం ఆమె...'
ల్లి ప్రేమ లేకుండానే బాల్యం అంతా గడిచిపోయింది. తాతయ్యతో పాటు నాటకాలు వేసి.. అలా నటన మీద ఏర్పడిన ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 'పటాస్' లాంటి పంచ్‌లతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ట్రెండ్‌కు తగ్గట్టు అతడు పలికే హావభావాలను చూసిన ఆడియన్స్ జబర్దస్త్‌గా చేశాడే అనుకున్నారు. అతడే ఆర్టిస్ట్ ప్రవీణ్. ఇంద్రజ పరిచయం అయ్యాక తనకు తల్లిలేని లోటు తీరందని అంటున్నాడు ప్రవీణ్.
- 'నాకు ఆ అవకాశం వస్తే ధోనీ బుర్రను చదివేస్తా'
వికెట్ కీపర్, బ్యాట్సమెన్ దినేశ్ కార్తిక్‌కు ఇతరుల ఆలోచనలను చదివే శక్తి వస్తే మొదట ధోనీ బుర్రను చదివేస్తాడట. ఈ విషయాన్ని బీసీసీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూలో డీకే ఇంకా ఏం విషయాలు చెప్పాడంటే..
ఏపీ ప్రధాన వార్తలు