- ఈనాడు విలేకరిపై దాడి.. ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు
ఈనాడు విలేకరిపై దాడికి పాల్పడిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడిపై కేసు నమోదైంది. విలేకరి ఫిర్యాదు ఆధారంగా తాడిపత్రి పోలీసులు హర్షవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. విలేకరి వద్ద లాక్కున్న సెల్‌ఫోన్‌ను వెనక్కి ఇప్పించారు.
- మద్య నిషేధం అంటే.. 22 వేల కోట్లు పిండుకోవడం: జనసేన
మద్యం ఆదాయంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. మద్యపాన నిషేధమంటే మద్యం ఆదాయం రూ.22 వేల కోట్లకు పెంచటమా? అని ప్రశ్నించారు. 'స్పిరిటెడ్ విజనరీ' జగన్ మేనిఫెస్టో అమలు తీరు ఇదేనని ఎద్దేవా చేశారు.
- గన్నవరం వైకాపాలో రచ్చ.. వల్లభనేని వర్సెస్ యార్లగడ్డ!
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు మధ్య వర్గపోరు మరింత ముదురుతోంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా టికెట్ తప్పకుండా తనకే వస్తుందన్న యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు.
- మంగళగిరి ఎయిమ్స్‌లో.. త్వరలో ఎమర్జెన్సీ సేవలు: కేంద్ర మంత్రి
మంగళగిరి ఎయిమ్స్‌లో కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ పర్యటించారు. ఎయిమ్స్ ఆవరణలో మొక్కలు నాటిన కేంద్రమంత్రి.. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్‌పై ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
- రాష్ట్రపతి ఎన్నికలపై 15న విపక్షాల భేటీ.. ఆ సీఎంలకు దీదీ లేఖ
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ఓడించేందుకు విపక్షాలు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. ఈ మేరకు ఈనెల 15న దిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు భేటీకి హాజరుకావాలని విపక్ష నేతలు, ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.
- 'దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే వారికి లొంగబోం'
బంగారం స్మగ్లింగ్ కేసులో తనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేరళ సీఎం పినరయి విజయన్ ఫైర్ అయ్యారు. ప్రజల మద్దతు, విశ్వాసం తనకు ఇంకా ఉందని అన్నారు.
- అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్.. తైవాన్ జోలికొస్తే..
అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశం నుంచి తైవాన్ను విడదీసే ధైర్యం చేస్తే.. ఆర్మీ యుద్ధాన్ని ప్రారంభించడానికి చైనా ఏ మాత్రం వెనుకాడబోదని హెచ్చరించింది.
- 'పసిడి'పై ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు సురక్షితమా.. కాదా?
మూడు నెలల క్రితం వరకు బంగారం పెట్టుబడులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచిన నేపథ్యంలో పెట్టుబడులు సురక్షితమా.. కాదా అని తెలుసుకుందామా?
- ఆర్టిస్ట్ అనీశ్గా అదరగొట్టేసిన నాగ్.. వెయ్యి నందుల బలంతో..
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'బ్రహ్మాస్త్రం'. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న కింగ్ నాగార్జునకు సంబంధించి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది మూవీటీమ్. పవర్ఫుల్ లుక్‌లో ఉన్న నాగ్‌ను చూసి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
- పంత్ కెప్టెన్సీకి సవాల్.. రెండో టీ20లో భారత్ బోణి కొడుతుందా?
దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో ఓటమిని ఎదుర్కొన్న టీమ్ఇండియా.. రెండో టీ20తో బోణి కొట్టాలని భావిస్తోంది. కేఎల్ రాహుల్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టిన పంత్‌కు తొలి మ్యాచ్ ఫలితంతో రెండో టీ20 సవాల్‌గా మారింది. భవిష్యత్‌లో జట్టు పగ్గాలు చేపట్టేందుకు పంత్‌కు ఈ సిరీస్ చాలా కీలకం కానుంది.
![AP TOP NEWS: ప్రధాన వార్తలు @9PM ప్రధాన వార్తలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15534050-399-15534050-1654960842685.jpg)
ప్రధాన వార్తలు