ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @3PM - ఏపీ టాప్ న్యూస్

.

ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Apr 20, 2022, 2:58 PM IST

  • CM Jagan on nellore leaders disputes: నెల్లూరు జిల్లా వైకాపా నేతల రచ్చపై సీఎం జగన్ ఆగ్రహం
    నెల్లూరు జిల్లాలో వైకాపా నేతల రచ్చపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫ్లెక్సీల వివాదం సహా అనేక అంశాలను సీరియస్​గా తీసుకున్న సీఎం.. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్​ను.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. ఈ విషయంపై కాకాణి, అనిల్‌కు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. వీరిద్దరూ మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇరు నేతల మధ్య విభేధాలను సీఎం పరిష్కరించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • CBN Birthday Celebrations: రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
    తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి 73వ పుట్టినరోజుని పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు రాష్ట్రంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. 72కేజీల కేక్‌ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • తలుపుల జూనియర్ కళాశాల వ్యవహారంపై కలెక్టర్ స్పందన... విచారణకు ఆదేశం
    శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల జూనియర్ కళాశాల వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ స్పందించారు. విద్యార్థినులను వేధిస్తున్న లెక్చరర్లపై వెంటనే విచారణ చేపట్టాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ఆదేశించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Students makes sanitation works: పారిశుద్ధ్య కార్మికులుగా.. పాఠశాల విద్యార్థులు
    ప్రాథమిక పాఠశాల విద్యార్థులే పారిశుద్ధ్య కార్మికులుగా మారిన ఘటన.. గుంటూరు జిల్లా తెనాలిలోని నందివెలుగులో జరిగింది. వారం రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు పాఠశాల వైపు కన్నెత్తి చూడకపోవటంతో.. విద్యార్థులే పాఠశాల ప్రాంగణంలోని చెత్తను సేకరించి డబ్బాల్లో మోసుకుంటూ ఊరి బయట పారబోస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'సంప్రదాయ ఔషధాలపై ఆయుష్ ముద్ర.. వారికి ప్రత్యేక వీసా'
    భారత్​లో తయారయ్యే సంప్రదాయ ఔషధాలపై ఇకపై ఆయుష్ గుర్తు ఉంటుందని చెప్పారు ప్రధాని మోదీ. సంప్రదాయ చికిత్స కోసం భారత్​కు వచ్చే వారికి ఆయుష్ వీసాలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • సౌరజ్వాలల వల్లే ఈరోజు ఇంత ఎండ! ఉపగ్రహాలకు డ్యామేజ్!!
    సూర్యుడు బుధవారం ఉగ్రరూపం చూపించాడు. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్​ వ్యవస్థల్ని దెబ్బతీసే స్థాయిలో సౌరజ్వాలలతో విరుచుకుపడ్డాడు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్​ ఇన్​ స్పేస్ సైన్సెస్ ఇండియా ఈ విషయం వెల్లడించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • పుచ్చపండు ధర కిలో రూ.4లక్షలు.. ప్రత్యేకత ఏమిటంటే..?
    ఎంత సీజనైనా కేజీ పుచ్చకాయ ధర కేజీ రూ. 100 మించదు. కానీ ఇప్పుడు చెప్పబోయే పండు ధర వింటే కచ్చితంగా షాకవుతారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా దీనికి పేరు. మార్కెట్లో ఒక కాయ ధర రూ. 19 వేల నుంచి రకాన్ని బట్టి రూ. 4లక్షల వరకూ పలుకుతుంది. అన్నట్టు దీనిపేరిట ఓ గిన్నీస్‌ రికార్డు కూడా ఉందండోయ్‌. ఇంతకీ ఏమిటా పండు ప్రత్యేకత? ఎందుకంత ధర అంటారా..?పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెరిగిన బిట్​కాయిన్ విలువ
    బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి దాదాపు రూ.1,450 దిగొచ్చింది. మరోవైపు బిట్​ కాయిన్ విలువ క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పసిడి ధరలు, అంతర్జాతీయ మార్కెట్​లో క్రిప్టో కరెన్సీల విలువ ఎలా ఉన్నాయంటే..పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రణ్​బీర్​-ఆలియాకు గిఫ్ట్​గా రూ.26కోట్ల ఫ్లాట్.. ఎ​వరిచ్చారంటే?
    రణ్​బీర్​ కపూర్​-ఆలియాభట్​కు శుభాకాంక్షలు తెలుపుతూ ఖరీదైన కానుకలను ఇచ్చారు పలువురు సెలబ్రిటీలు. అందులో రూ.26కోట్లు విలువ చేసే ఫ్లాట్​​​ కూడా ఉందని తెలిసింది. ఇంతకీ ఆ బహుమతి ఎవరిచ్చారంటే? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'కోహ్లీ ఒక్కడే కాదు.. అతనిలా మరో ఇద్దరు..'
    విరాట్‌ కోహ్లీకి కొద్ది రోజులు విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భారీ అంచనాలు, తీవ్ర ఒత్తిడి నడుమ అతడు చితికిపోతున్నాడని తెలిపాడు. విరాట్​లా ఇబ్బందికర పరిస్థితుల్లో మరో ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారని అన్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details