- ఉగాది పంచాంగంలో.. ఆర్థిక సంక్షోభం ఖాయంగా కనిపిస్తోంది: యనమల
గ్రామ పంచాయతీల అధికారాలను సర్పంచుల చేతిలో నుంచి లాగేయటం ఆర్టికల్ 73, 74కు వ్యతిరేకమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. పంచాయతీల నిధులు దారి మళ్లించి.. అభివృద్ధికి నోచుకోలేని స్థితిలో గ్రామ పంచాయతీలను ఉంచారని ప్రభుత్వంపై మండిపడ్డారు. శుభకృత్ నామ సంవత్సర ప్రజాపంచాంగంలో ఆర్ధిక సంక్షోభం ఖాయంగా కనిపిస్తోందని తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- అమరావతికి భూములిచ్చిన రైతులకు జగన్ అన్యాయం చేస్తున్నారు - జీవీఎల్
రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళిక లేకుండా 26 జిల్లాల పునర్విభజన చేస్తూ హడావుడిగా గెజిట్ ఇచ్చిందని భాజపా రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్ విమర్శించారు. కలెక్టరేట్లు ఏర్పాటు చేస్తే.. అక్కడ అనువైన సౌకర్యాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసేలా జగన్ చర్యలు ఉన్నాయని.. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆట ఆడాలంటే.. డబ్బు కట్టాల్సిందే.. రాష్ట్ర సర్కారు కొత్త రూల్ ఫలితం..!
ఆటలు ఆర్థికంగా భారం కానున్నాయా..? సర్కారు వైఖరి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నగరాలు, పట్టణాల్లోని క్రీడా మైదానాల్ని ప్రైవేట్ సంస్థలకు అద్దెకిచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇకపై అక్కడ ఎవరైనా ఆటలు ఆడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. "పే అండ్ ప్లే" పేరుతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తెచ్చిన కొత్త విధానం ఆటగాళ్ల జేబులు ఖాళీ చేయనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- అర్ధరాత్రి పబ్‌లో నిహారిక.. వీడియో రిలీజ్ చేసిన నాగబాబు
హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్ పబ్ ఘటనపై.. సినీనటుడు నాగబాబు స్పందించారు. డ్రగ్స్ విషయమై తన కుమార్తె గురించిన వివరాలు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- అమ్మానాన్నల 'కష్టాల సాగు'.. చెల్లిని చూసుకుంటూనే పదేళ్ల బాలిక 'అక్షర సేద్యం'
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిందండ్రులు కష్టాల సాగు చేస్తుంటే.. 10 ఏళ్ల చిన్నారి చెల్లిని చూసుకుంటూనే అక్షర సేద్యం చేస్తోంది. చెల్లిని ఎత్తుకుని పాఠాలు వింటున్న చిన్నారి ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ పాప ఎవరు? ఆ స్టోరీ ఏంటి? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- మైనర్‌పై గ్యాంగ్ రేప్.. బాధితురాలి ఆత్మహత్య17 ఏళ్ల మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. మనస్తాపంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హరియాణాలో ఆదివారం జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- వారం రోజులుగా కఠినమైన లాక్డౌన్.. అయినా పెరుగుతున్న కరోనా కేసులు
చైనాలో అతిపెద్ద నగరమైన షాంఘైలో కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నా కేసులు తగ్గడంలేదు. లాక్డౌన్ కారణంగా కోట్లాది మంది ప్రజలు ఇళ్లల్లో ఉండి ఇబ్బందులు పడుతున్నా.. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- బీపీ, షుగర్, ఊబకాయం.. ఈ జాగ్రత్తలు పాటిస్తే దూరం!
ఒకప్పుడు 50ఏళ్లు దాటిన వారే అనారోగ్యానికి గురయ్యేవారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి వల్ల చిన్న వయసులోనే రోగాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, నిద్ర సమయం, పనివేళలు మారడం వల్ల శరీరంలో సమతుల్యత లోపిస్తోంది. దీనివల్ల దీర్ఘకాలిక జబ్బుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- Malaika Car accident: ఆస్పత్రి నుంచి మలైకా అరోరా డిశ్చార్జ్!
రోడ్డు ప్రమాదానికి గురైన బాలీవుడ్ నటి మలైకా అరోరా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె తన ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో 7 ఫోర్లు కొడితే ధావన్ అరుదైన రికార్డు.. తొలి భారత బ్యాటర్‌గా!
ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం.. చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్‌లో రాణించి.. పలు రికార్డులను అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్. రాత్రి 7.30 గంటలకు ముంబయి బ్రబౌర్న్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ ప్రధాన వార్తలు