ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ఏపీ టాప్ న్యూస్

.

ap top news
ap top news

By

Published : Oct 30, 2020, 4:59 PM IST

  • చైల్డ్​లైన్​లో చిన్నారుల 'నిశ్శబ్ద' వేదన
    ఆపదలో ఉన్న పిల్లలకు ఆపన్నహస్తం అందించేందుకు ఏర్పాటు చేసిన చైల్డ్​లైన్​ 1098కు చెందిన ఓ నివేదిక నిర్ఘాంతపోయే విషయాలను వెల్లడించింది. బాలల హక్కుల రక్షణ కోసం ఏర్పాటైన ఈ హెల్ప్​లైన్​కు దాదాపు 40 శాతం 'సైలెంట్​ కాల్స్'​ వస్తున్నాయట.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • స్టీలు పరిశ్రమకు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చేయండి: జేసీ ప్రభాకర్ రెడ్డి
    అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలం బొందలదిన్నె, వంగనూరు రైతులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • రైతులకు బేడీలు వేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసన
    అమరావతి రైతులకు బేడీలు వేసి అరెస్ట్ చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై పోలీసుల ఆకస్మిక దాడి
    విజయనగరంలోని బెట్టింగ్ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో బెట్టింగ్​కు ఉపయోగించే ఉపకరణాలు, చరవాణులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • గుజరాత్​లో 'ఆరోగ్య వన్'​ ప్రారంభించిన మోదీ
    గుజరాత్​లోని నర్మదా జిల్లాలో ఔషధ మొక్కల వనమైన 'ఆరోగ్య వన్'ను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ దేవ్​రథ్​, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'ఆంథ్రిక్స్​'కు అమెరికా కోర్టు భారీ జరిమానా
    ఉపగ్రహ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న కారణంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వాణిజ్య విభాగమైన ఆంథ్రిక్స్​ కార్పొరేషన్‌కు అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. మొత్తం 1.2 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొంది న్యాయస్థానం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సీఎం రాజీనామాకు కాంగ్రెస్, భాజపా డిమాండ్
    కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో బాధ్యత వహిస్తూ సీఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కొల్లాం జిల్లాలో జాతీయ రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'వైద్య విద్య రిజర్వేషన్​ బిల్లు'కు గవర్నర్​ ఆమోదం
    తమిళనాడులో వైద్య విద్య రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు గవర్నర్​ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. బిల్లు ఆమోదంలో ఆయన ఆలస్యం చేస్తున్నారని ఇటీవల డీఎంకే సహా ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. ఈ నేపథ్యంలోనే భన్వరీలాల్​ పురోహిత్​ తన సమ్మతి తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • జోన్స్​తో మ్యాచ్​ కోసం ఎదురుచూస్తున్నా: టైసన్
    త్వరలో జరగనున్న ఛారిటీ బాక్సింగ్​ మ్యాచ్​పై దిగ్గజ బాక్సర్ మైక్​ టైసన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయ్​ జోన్స్​తో తలపడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. లాస్​ ఏంజెలిస్​లో జరగనున్న ఈ పోటీలో ఇరువురూ హెడ్​గార్డ్​ లేకుండానే తలపడనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • గోన గన్నారెడ్డి పాత్రలో బాలయ్య!
    నందమూరి నటసింహం బాలకృష్ణ మరో చారిత్రక యోధుడి కథపై మనసుపారేసుకున్నారట. కాకతీయుల కాలంనాటి గోన గన్నారెడ్డి పాత్రలో నటించడానికి మొగ్గుచూపుతున్నారట. అందుకోసం ఇప్పటికే రచయితలు, కొంతమంది పరిశోధనలను కూడా ఏర్పాటు చేసుకున్నారట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details