ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

.

9 PM TOP NEWS
9 PM TOP NEWS

By

Published : Sep 30, 2020, 8:59 PM IST

Updated : Sep 30, 2020, 9:05 PM IST

  • 'పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం'
  • రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా రేపు కీలక చర్య తీసుకోబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పంటల వారీగా ఇవ్వాల్సిన కనీస మద్దతు ధరలను ప్రకటించనున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 48 గంటల్లో మరో అల్పపీడనం... రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల... రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 7 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. కొత్తగా 6,133 నమోదు
  • రాష్ట్రంలో కొత్తగా 6,133 కరోనా కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,828 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 6,93,484కి కరోనా బాధితుల సంఖ్య చేరింది. ప్రస్తుతం 58,445 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • రైతు భరోసా కేంద్రాల నుంచి ఎరువుల హోం డెలివరీ ప్రారంభం
  • రైతు భరోసా కేంద్రాల నుంచి ఎరువుల హోం డెలివరీ ప్రక్రియ ప్రారంభమైంది. దిల్లీ నుంచి కేంద్రమంత్రులు సదానందగౌడ, మన్​సుఖ్ మాండవియా సహా ముఖ్యమంత్రి జగన్ రైతులకు ఎస్​ఎంఎస్​ ద్వారా సమాచారం అందించే వ్యవస్థను ప్రారంభించారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • అన్​లాక్​ -5: సినిమా హాళ్లు తెరిచేందుకు కేంద్రం అనుమతి
  • కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 30తో అన్‌లాక్‌ 4.0 గడువు ముగియనుండగా.. మరిన్ని మినహాయింపులతో కూడిన 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్- డిజిటల్ లైసెన్సు​ ఉంటే చాలు
  • వాహనాల డాక్యుమెంట్లు, ఈ-చలానాలన్నీ ఆన్​లైన్​లో తప్పనిసరిగా నమోదు చేయాలన్న కేంద్రం నిబంధనలు.. అక్టోబర్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. వాహనదారుల లైసెన్సు, ఇతర డాక్యుమెంట్లు ఆన్​లైన్​లో నమోదై ఉంటే.. ఇకపై పోలీసులకు, ఇతర అధికారులకు కాగితాల రూపంలో చూపించాల్సిన అవసరం ఉండదు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'బాబ్రీ తీర్పు'తో కమలదళానికి కొత్త ఉత్సాహం
  • రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాలపై ప్రభావం చూపిస్తోన్న.. రామజన్మభూమి వివాదం సమసిపోయినట్లే కనిపిస్తోంది. బాబ్రీ ఘటనకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టు వెలువరించిన తాజా తీర్పు.. భాజపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఇంటి వద్దకే విద్య: గోడలనే బ్లాక్​బోర్డులుగా మలిచి.!
  • ఆన్​లైన్​లో క్లాసులను వినలేని విద్యార్థుల కోసం ఝార్ఖండ్​ దుమ్కా ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు. విద్యార్థులకు బోధించటానికి వారి ఇంటి గోడలను బ్లాక్​బోర్డులుగా మలిచి పాఠాలను నేర్పిస్తున్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • లైవ్​ అప్​డేట్స్​: రాజస్థాన్​ వర్సెస్​ కోల్​కతా
  • జోఫ్రా ఆర్చర్ బౌలింగ్​లో శుభ్​మన్​ గిల్​(47) పెవిలియన్​ చేరాడు. 11.1 ఓవర్ల సమయానికి కోల్​కతా స్కోరు 89/3. క్రీజులో దినేశ్​ కార్తీక్​, రస్సెల్​ ఉన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'సైనైడ్'​ చిత్రంలో ప్రియమణి కీలకపాత్ర
  • వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు ​రాజేశ్​ టచ్​ రివర్ తెరకెక్కించనున్న చిత్రం 'సైనైడ్'​. ఇందులో ప్రియమణి కీలక పాత్ర పోషించనున్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Last Updated : Sep 30, 2020, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details