ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ఏపీ తాజా వార్తలు

.

ap Top news
ap Top news

By

Published : Sep 12, 2020, 5:00 PM IST

  • దేవాలయాలకు జియో ట్యాగింగ్‌: గౌతం సవాంగ్
    రాష్ట్రంలో దేవాలయాలు, ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయనున్నట్టు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ప్రార్థన మందిరాల వద్ద నిఘా కొనసాగించేలా.. ఎస్పీలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్లతో పాలనానుమతులు
    ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్య కళాశాలల నిర్మాణం జరగనుంది. వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్లతో పాలనానుమతులు వచ్చాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • పుష్కరాల ఘటనపై చంద్రబాబు సీబీఐ విచారణ చేయించారా?: బొత్స
    ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నా.. కొందరు కావాలని బురదజల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గోదావరి పుష్కరాల ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయినా చంద్రబాబు సీబీఐతో విచారణ చేయించారా? అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'గతంలోనూ ఇలాగే చేశారు..కొంతమంది అధికారులు ఊచలు లెక్కపెట్టారు'
    హైకోర్టు వ్యాఖ్యలను బట్టి రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందని నారా లోకేశ్ విమర్శించారు. సీఎం జగన్ దగ్గర మార్కులు కొట్టేయడానికి కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఆ రాష్ట్రంలో భూమి కోసం వాయుసేన మంతనాలు
    వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో సదుపాయాలపై వాయుసేన దృష్టి సారించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్​తో ఎయిర్​ మార్షల్​ రాజేశ్ కుమార్​ భేటీ అయ్యారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • కొరియర్​లో రియా ఇంటికి డ్రగ్స్ సరఫరా
    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ ఎన్​సీబీకి వెల్లడించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • లంక ప్రీమియర్ లీగ్​ వేలంలో మునాఫ్ పటేల్
    లంక ప్రీమియర్ లీగ్​లో ఆడేందుకు టీమ్​ఇండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ఆసక్తి చూపిస్తున్నాడు. శ్రీలంక బోర్డు తొలిసారి నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్ వేలంలో అతడు పాల్గొనబోతున్నాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • అమెరికాలో 'టిక్‌టాక్‌' మూసివేత ఖాయమేనా?
    ప్రముఖ సోషల్​ మీడియా వీడియో షేరింగ్​ యాప్​ టిక్​టాక్​ అమెరికాలో కొనసాగనుందా? లేక మూతపడనుందా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • బంగారం గనిలో ప్రమాదం.. 50 మంది మృతి
    కాంగోలో బంగారం కోసం అక్రమంగా తవ్వకాలు జరిపి 50 మంది ప్రాణాలను కోల్పోయారు. తవ్వకాలు చేస్తుండగా గని ఒక్కసారిగా కూలడం వల్ల ఈ ఘటన జరిగింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'ఈటీవీ'లో ఉమామహేశ్వరుడి కథ.. తప్పక చూడండి
    సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా తొలిసారి బుల్లితెరపై సందడి చేయనుంది. సెప్టెంబరు 13 (ఆదివారం)న సాయంత్రం ఆరు గంటలకు ఈటీవీ ఛానల్​లో ప్రసారం కానుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details