కలియుగ వైకుంఠనాథుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభోవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడవాహన సేవను... నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవీ సమేతులైన శ్రీ మలయప్పస్వామి... ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై విహరించారు. ధూప దీప నైవేధ్యాలు, వేద మంత్రాల నడుమ తిరుమలేశుని వాహన సేవ ఆద్యంతం వీనులవిందు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వ్యాక్సిన్ వచ్చేవరకు నిర్లక్ష్యం వద్దు: మోదీ
కరోనాపై జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ప్రతి భారతీయుడికి చేరవేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వైరస్ పోయిందని, ప్రమాదం లేదని అనుకోవద్దని ప్రజలకు సూచించారు. పండుగల వేళ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న సంతోషాలు దూరమైపోతాయని హెచ్చరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కొవిడ్ వ్యాక్సిన్లు ఏఏ దశలో ఉన్నాయంటే..
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వేర్వేరు కంపెనీల పరీక్షలు తుది దశకు చేరుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పంజాబ్‌కు ఆరెంజ్ క్యాప్.. దిల్లీకి పర్పుల్ క్యాప్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్, దిల్లీ క్యాపిటల్స్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న కేఎల్ రాహుల్ పంజాబ్ జట్టులో ఉండగా.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రబాడా దిల్లీ జట్టులో ఉన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సినీనటుడు పృథ్వీరాజ్‌కు రోడ్డు ప్రమాదం
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని నటుడి సోషల్‌మీడియా బృందం ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఏ సమాచారం ఇవ్వలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఐటీ షేర్ల అండతో స్టాక్ మార్కెట్లకు లాభాలు
ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. మంగళవారం సెషన్‌ను స్వల్ప లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 113 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ స్వల్పంగా 24 పాయింట్లు పుంజుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి