- వరుసగా 10వ రోజు 10వేలకు పైగా కరోనా కేసులు
రాష్ట్రంలో వరుసగా 10వ రోజు 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 10,825 కరోనా కేసులు, 71 మరణాలు చోటు చేసుకున్నారు. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,87,331కి చేరాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- విద్యుత్ మీటర్లు రైతుల పాలిట ఉరితాళ్లు: చంద్రబాబు
వ్యవసాయ బోర్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యుత్ మీటర్లు రైతుల పాలిట ఉరితాళ్లని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నగదు బదిలీ పేరిట తీసుకువచ్చిన 22వ నెంబర్ జీవోను రద్దు చేసి ఉచిత విద్యుత్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- తిరుమలపై కోవిడ్ ప్రభావం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
తిరుమల శ్రీవారి ఆలయంపై కోవిడ్ ప్రభావం పడింది. తిరుపతిలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- తెలంగాణ: దశల వారీగా మూడు కారిడార్లలో మెట్రో సేవలు
ఈ నెల 7 నుంచి హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. దశలవారీగా సర్వీసులు పునఃప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కొవిడ్ లక్షణాలు లేనివాళ్లకు మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'టీకా కోసం 2021 ద్వితీయార్థం వరకు ఆగాల్సిందే'
కరోనా వ్యాక్సిన్‌పై డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త డా.సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్‌కు అన్ని అనుమతులు వచ్చినా.. 2021 ద్వితీయార్థం వరకు భారీ స్థాయిలో పంపిణీ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- సరిహద్దులో పాక్ కాల్పులు..సైనికుడు మృతి
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో భారత సైనికుడు ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'ఎన్నికలు వస్తున్నాయ్.. విభేదాలకు చెక్ పెట్టండి'
అసోంలో మరోమారు ప్రభుత్వాన్ని స్థాపించేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకే ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఒక్క అంగుళం కూడా వదులుకోం: చైనా
రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చైనా రక్షణమంత్రి ఫెంగే జరిపిన సమావేశంపై ఆ దేశం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సరిహద్దు ఉద్రిక్తతలపై మరోసారి అవే అసత్యాలు చెప్పుకొచ్చింది. భారత్ చర్యల వల్లే ఉద్రిక్తతలు తలెత్తాయని ఆరోపించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- నా స్థానంలో ధోనీ బరిలోకి దిగాలి: రైనా
ఈసారి ఐపీఎల్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా. దీంతో అతడి మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై తాజాగా రైనా స్పందించాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రముఖ నిర్మాత జానీ బక్షి కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత జానీ బక్షి కన్నుమూశారు. శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి