ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీ ఎండీలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై కీలకమైన చర్చ జరగనుంది. అంతర్రాష్ట్ర ఒప్పందంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీల ఎండీలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసుల అవగాహన ఒప్పందంపై ఎండీలు సంతకాలు చేయనున్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు తిప్పే కిలోమీటర్లపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇరు రాష్ట్రాలు చెరో లక్షా 60 వేల కి.మీ. తిప్పాలని నిర్ణయించాయి
ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీల కీలక సమావేశం
ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర సర్వీస్‌లపై ఇవాళ కొలిక్కిరానున్నాయి. ఇరు ఆర్టీసీల ఎండీలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. అంతర్రాష్ట్ర సర్వీలపై అవగాహన ఒప్పందంపై చర్చించి, సంతకాలు చేయనున్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు చెరో లక్షా 60 వేల కి.మీ తిప్పాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీల కీలక సమావేశం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించటంతో మార్చి 23 నుంచి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను సడలించినప్పటికీ ఇవి పునఃప్రారంభానికి నోచుకోలేదు. ఈ ఒప్పందంతో ఎట్టకేలకు సుమారు ఏడున్నర నెలల తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి :అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఇక రైట్ రైట్!