స్థానిక సంస్థలకు పెద్దపీట వేస్తే పాలనతోపాటు ఆరోగ్యపరంగానూ ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని కేరళ నిరూపిస్తోంది. అక్కడ ఇప్పటికీ ప్రతిరోజూ కొవిడ్ కేసులు వేలల్లో నమోదవుతున్నా... పంచాయతీ స్థాయిలోనే మెజారిటీ బాధితులకు సులువుగా చికిత్స అందుతోంది. బాధితులూ ప్రభుత్వ ఆసుపత్రులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కడ కొవిడ్‌కు నాలుగు అంచెల్లో చికిత్స అందుబాటులో ఉంది. ఈమేరకు కేరళలో మన రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం అధ్యయనం చేసింది.
ఫ్యామిలీ క్లినిక్కులతో ముందడుగు
లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులను పంచాయతీ కొవిడ్ సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. కేరళలో నలుగురు వైద్యులతో ఆసుపత్రులు (ఫ్యామిలీ క్లినిక్స్) నడుస్తున్నాయి. వీటి పర్యవేక్షణలో ప్రతి పంచాయతీలో ప్రత్యేకంగా 1,100 కొవిడ్ సంరక్షణ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేశారు. తర్వాతి అంచెలోని 300 సెకôడ్‌లైన్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. అక్కడి నుంచి కేసుల తీవ్రతకు అనుగుణంగా ఫస్ట్‌లైన్, జిల్లా కేంద్ర ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు తరలిస్తున్నారు.
వైద్య బడ్జెట్‌లో నుంచి పంచాయతీలకు 30% నిధులు
‘రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం కేటాయించే బడ్జెట్‌లో 30% నిధులు పంచాయతీలకు వెళ్తున్నాయి. ఫలితంగా కొవిడ్ అవసరాలకు తగినట్లు పంచాయతీలే నిధులను ఖర్చు చేస్తున్నాóు. సిబ్బంది నియామకాలనూ చేపడుతున్నాóు. దాంతో బాధితులకు సకల సౌకర్యాలు అందుతున్నాయి’ అని కమిటీ సభ్యులు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్ వెల్లడించారు.